Hajj 2021: ఈసారి హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకునే గడువు ముగిసిపోయింది. జనవరి 10వ తేదీలోగా దరఖాస్తులు స్వీకరించారు. ఈసారి కరోనా వైరస్ కారణంగా హజ్ యాత్రకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కేవలం 6 వేల 235 మంది మాత్రమే హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకున్నారు.
2018లో 46 వేలు, 2019లో దాదాపు 35 వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ 2021లో దరఖాస్తులు కేవలం 6 వేల 235 మాత్రమే వచ్చాయి. 12 వందల మంది దరఖాస్తు చేసుకునే నగరం నుంచి..ఈసారి 218 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. అత్యధికంగా లక్నో నుంచి 370 మంది దరఖాస్తు చేశారు.
మరోవైపు 2019లో గ్రీన్ కేటగరీ కింద 2 లక్షల 90 వేలు ఖర్చయ్యేది. అజీజియాలో 2 లక్షల 42 వేల రూపాయలు ఇవ్వాల్సి వచ్చేది. కానీ 2021లో అజీజియా కేటగరీలో ప్రయాణపు ఖర్చు 3 లక్షల 44 వేల 133 రూపాయలైంది. అటు గ్రీన్ కేటగరీని పూర్తిగా తొలగించేశారు.
నిబంధనల ప్రకారం 18 నుంచి 65 ఏళ్లవారికే హజ్ యాత్రకు అనుమతి లభిస్తుంది. దాంతోపాటు యాత్రలో అత్యంత ఖరీదైన సౌకర్యంగా భావించే గ్రీన్ కేటగరీ తొలగించేశారు. భక్తుల సంఖ్య తగ్గడానికి ఇది కూడా ఓ కారణం కావచ్చు.
ఈసారి కరోనా సంక్రమణ భయం, సౌదీ అరేబియా ఒత్తిడి కారణంగా కేంద్ర హజ్ కమిటీ విధించిన ఆంక్షల కారణంగా ప్రజల్లో ఆసక్తి తగ్గింది. అంతేకాకుండా ఇన్ కంటాక్స్కు సంబంధించిన చాలా విషయాలున్నాయి. ఆ కారణంగా జనం వెనక్కి తగ్గుతున్నారు. రిటర్న్ దాఖలు చేయనివారు కూడా వెనక్కి తగ్గుతున్నారు.
హజ్ యాత్ర అనేది ఇప్పటివరకూ ఎప్పుడూ ఆగలేదు. రెండు ప్రపంచయుద్ధాల సమయంలో కూడా హజ్ యాత్ర కొనసాగింది. కానీ ఆ సమయంలో తక్కువమంది హాజరయ్యారు. ఇంత తక్కువ సంఖ్యలో హజ్ యాత్రకు వెళ్లడమనేది ఈ శతాబ్దంలో ఇదే తొలిసారి.
గత గణాంకాల్ని పరిశీలిస్తే..గత ఐదేళ్లలో హజ్ యాత్రకు వెళ్లేవారి సంఖ్య ఎప్పుడూ 14 వేల కంటే తక్కువగా లేదు. ఈసారి కరోనా భయంతో హజ్ యాత్రకు వెళ్లడం లేదని తెలుస్తోంది. అయితే మహిళల సంఖ్యలోనే తగ్గుదల కన్పించేందుకు ప్రధాన కారణమేమీ లేదు.
గడిచిన కొన్నేళ్ల గణాంకాలు పరిశీలిస్తే..2013లో 45.82 శాతం, 2014లో 45.24 శాతం, 2015లో 45.05 శాతం, 2016లో 45.57 శాతం, 2017లో 46 శాతం, 2018లో 47 శాతం, 2019లో 47 శాతం మహిళలు హజ్ యాత్రకు వెళ్లారు. 2020లో కరోనా వైరస్ కారణంగా భారతదేశం నుంచి ఎవరూ హాజరుకాలేదు.
ఉత్తరప్రదేశ్ నుంచి కేవలం ముగ్గురు మహిళల ఒక గ్రూప్ దరఖాస్తు చేసుకుంది. ఈ ముగ్గురిది కూాడా ఇంకా ఖరారు కాలేదు. ఇంకా దరఖాస్తులు మంజూరు కావల్సి ఉన్నాయి. ఇవి కాకుండా గత యేడాది గురించి పరిశీలిస్తే..దాదాపు 45 శాతం మహిళలు హజ్ యాత్రకు హాజరయ్యేవారు. కానీ ఇప్పుడు కేవలం 6 వేల 235 దరఖాస్తులు మాత్రమే చేరాయి.