Colors Swathi Reddy: బంపర్ జాక్ పాట్ కొట్టేసిన కలర్స్ స్వాతి.. ఏకంగా పాన్ ఇండియా మూవీలో చాన్స్.. డిటెయిల్స్ ఇవే..

Heroine Colors Swathi:  కలర్స్ స్వాతి మళ్లీ వార్తలలో నిలిచారు. ఆమె ఏకంగా పాన్ ఇండియా మూవీలో చాన్స్ కొట్టేసినట్లు సమాచారం. కొన్నేళ్లుగా ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. కానీ మళయాళంలో మాత్రం ఈ అమ్మడికి మంచి ప్రాజెక్ట్ లే వచ్చాయి. 
 

1 /6

కలర్స్ స్వాతి తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఈ భామ గతంలో తన భర్తతో విడాకుల అంశంలో తెగ వైరల్గా మారారు. అయితే.. తెలుగులు అష్టాచమ్మా మూవీతో ఈ అమ్మడు ఒక రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకుంది.

2 /6

అయితే..తెలుగులో తప్ప.. తమిళం, మళయాలంలో మాత్రం ఈ కలర్స్ స్వాతికి భారీగానే సినిమా ఆఫర్ లు వచ్చాయి. అయితే.. గతంలో తన భర్త వికాస్  ఫోటోలు డిలీట్ చేయడం, అదే విధంగా ఇన్ స్టాలో తన భర్తను అన్ ఫాలో కావడం వంటి కాంట్రవర్సీలతో ఆమె వార్తలలో నిలిచారు.  

3 /6

నటి కలర్స్ స్వాతి ప్రస్తుతం ఒక భారీ పాన్ ఇండియా మూవీ స్వయంభూలో నటించబోతున్నారు. దీనిలో యంగ్ హీరో నిఖిల్ హీరోగా నటిస్తున్నారు.  దీనిలో కలర్స్ స్వాతీకి కీలక రోల్ దక్కింది. 

4 /6

ప్రస్తుతం వస్తున్న సినిమాలు అన్ని కూడా హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ తో వస్తున్నాయి ఈ స్వయంభూ సినిమా.. చోళ సామ్రాజ్య నేపథ్యంలో రూపొందిస్తున్నారు. దీనిలో నిఖిల్ యోధుడిగా కన్పించబోతున్నారు. గతంలో నిఖిల్, స్వాతి  కాంబోలో కార్తికేయ, స్వామిరార,తస్కరన్ వంటి పలు సినిమాలు చేశారు  

5 /6

వీరిద్దర్ని కూడా లక్కీ జోడిగా చెప్తుంటారు. ఈ మూవీలో కలర్స్ స్వాతికి కీలక రోల్ రావడం వెనుక నిఖీల్ కీలక పాత్ర పోషించాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో  మాత్రం కలర్స్ స్వాతి పాత్రకీ చాలా ప్రాధాన్యత ఉందని సమాచారం.  

6 /6

ఇక స్వయంభూతో కలర్స్ స్వాతి మరోసారి వెండి తెర మీద తళుక్కుమననున్నారు. దీంతో తనకు మరిన్ని అవకాశాలు వచ్చేచాన్సులు ఉంటాయని కూడా నటి భావిస్తుందంట.ఈ సినిమా పాన్ ఇండియా లేవల్ లో, భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. నిఖిల్ సరసన నభా నటేష్ , సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.