Hyderabad: మరోసారి అల్లకల్లోలంగా హైదరబాద్.. పలు చోట్ల కుండ పోత వాన.. భారీగా ట్రాఫిక్ జామ్..

Heavy rains in Hyderabad: హైదరాబాద్ లో  ఉదయం నుంచి ఆకాశంలో నల్లని మేఘాలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కుండపోతగా వాన మొదలైంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

1 /6

వరుణుడు రెండు తెలుగు రాష్ట్రాల మీద తన ప్రతాపం చూపిస్తున్నాడు. కొన్నిరోజులుగా రెండు తెలుగు స్టేట్స్ లలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని విజయవాడ వరదలకు అతలాకుతలం అవుతున్నాయి. 

2 /6

ఇప్పటికే ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రంగంలోకి దిగి అధికారులకు అనేక సూచనలు చేశారు. వరద ప్రభావిత ప్రాంతంలోని ప్రజలకు తమ వంతుగా.. ఆదుకునేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే ఆయా ప్రాంతాలు ఇప్పటికి కూడా వరద ప్రభావం నుంచి మాత్రం బైటపడలేదు.   

3 /6

ఈ నేపథ్యంలో.. మరోసారి రెండు తెలుగు స్టేట్స్ లలో కూడా .. భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే అలర్ట్ ను సైతం జారీచేసింది. ఈ క్రమంలో ఈరోజు హైదరాబాద్ లో ఉదయం నుంచి కూడా వాతావరణం చల్లగా ఉంది. 

4 /6

ఒకవైపు ఆదివారం కావడం, మరోవైపు గణపయ్యలను చూసేందుకు జనాలు రోడ్లమీదకు వచ్చారు.ఈ క్రమంలో మధ్యాహ్నాం ఒక్కసారిగా భారీగా వర్షం కురిసింది. గంట పాటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో కుండపోతగా వాన కురిసినట్లు తెలుస్తోంది.  

5 /6

దీంతో మరల రోడ్లన్ని ఎక్కడికక్కడ పూర్తిగా జలమయమైపోయాయి. గణపయ్యలను చూసేందుకు రోడ్ల మీదకు వచ్చిన వారంతా వర్షానికి తడిసిపోయినట్లు తెలుస్తోంది. అనేక చోట్ల వాహానాలు రోడ్ల మీద గుంతల్లో ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది.  

6 /6

ఒకవైపుఇప్పుడిప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు రోడ్లను క్లియర్ చేస్తున్నారు. రోడ్లపై ఏర్పడిన గుంతల్ని పూడుస్తున్నారు. పలుచోట్ల ప్యాచ్ వర్క్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో  మరోసారి కుండపోతగా వాన కురవడంతో.. జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.