Health Tips: చాలామందికి తరచూ అలసట ఉంటుంది. ఈ పరిస్థితుల్లో చాలా బలహీనంగా ఫీలవుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. నిత్యం యాక్టివ్‌గా ఉండాలంటే కచ్చితందా కొన్ని వస్తువుల్ని డైట్ నుంచి దూరం చేయాలి.
మీరు తరచూ అనారోగ్యకరమైన ఆహారం గానీ ఫ్యాట్ మీట్ గానీ తింటుంటే..వెంటనే అప్రమత్తం కావాలి. ఎందుకంటే వీటివల్ల అలసట ఎక్కువౌతుంది. అందుకే వెంటనే వీటి నుంచి దూరం పాటించాలి.
చాలామందికి క్యాండీ తినడం అంటే చాలా ఇష్టం. ఈ అలవాటుంటే వెంటనే అప్రమత్తత పాటించాలి. ఎందుకంటే క్యాండీ తినడం వల్ల అలసట ట్రిగ్గర్ అవుతుంది. అందుకే క్యాండీ వంటి పదార్ధాలను దూరం పెట్టాలి.
హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ నిండి ఉండే పదార్ధాల వల్ల ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఈ కారణంగా శరీరంలో అలసట సమస్య రావచ్చు
చాలామంది తమ దైనందిన జీవితాన్ని వైట్ బ్రెడ్‌తో ప్రారంభిస్తారు. కానీ వైట్ బ్రెడ్ బాడీలో అలసట పుట్టిస్తుంది. అంతేకాకుండా..ఆరోగ్యానికి హాని చేకూరుస్తుంది.
ఆల్కహాల్ బాడీని చాలా వేగంగా డీహైడ్రేట్ చేస్తుంది. ఆల్కహాల్ సేవించేవాళ్లు ఈ అలవాటును వెంటనే అప్రమత్తం కావాలి. ఆల్కహాల్ సేవించడం వల్ల బలహీనత, అలసట సమస్య ఉత్పన్నమౌతుంది.