World Richest Village: సాధారణంగా గ్రామాల్లో జీవించేందుకు పెద్దగా ఆధునిక సౌకర్యాలు ఉండవనే అనుకుంటారు. గ్రామాల్లో ఆదాయం కూడా తక్కువే ఉంటుంది. కానీ ఆ గ్రామాన్ని చూస్తే మీ అభిప్రాయం మారుతుంది. ఈ గ్రామంలో అందరూ కోటీశ్వరులే.
మాధాపూర్ విలేజ్ అసోసియేషన్ లండన్ దేశంలో పనిచేసే ఇక్కడి ప్రజలు 1968లో మాధాపూర్ విలేజ్ అసోసియేషన్ స్థాపించారు. ఈ అసోసియేషన్ ఉద్దేశ్యం విదేశాల్లో ఊరి పేరు నిలబెట్టడం.
షాపింగ్ మాల్స్, 5 స్టార్ హోటల్ సేవలు ఈ గ్రామం ఎంత సంపన్నమైందంటే ఇక్కడ ఇళ్లన్నీ విలాసవంతంగా ఉంటాయి. ఊర్లో అద్భుతమైన రోడ్లుంటాయి. ఆరోగ్య వ్యవస్థ బాగుంటుంది. ఎడ్యుకేషన్ సంస్థలు బాగుంటాయి. ఈ ఊర్లో షాపింగ్ మాల్, 5 స్టార్ హోటల్ కూడా ఉంది
గ్రామంలో దాదాపు అందరూ లక్షాధికారులే ఇక్కడ దాదాపు 7600 ఇళ్లున్నాయి. అత్యధికులు ఎన్ఆర్ఐలే. ఈ గ్రామంలో 17 బ్యాంకులున్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కోటీశ్వరులు లేదా లక్షాధికారులే కన్పిస్తారిక్కడ.
మాధాపార్ ధనిక గ్రామంగా ఎలా మారింది మాధాపార్ గ్రామం ఆర్ధికంగా పటిష్టంగా ఉండటానికి కారణం ఇక్కడి ప్రజల కష్టం, విదేశాల్లో సక్సెస్ అవడం. ఈ గ్రామంలో అత్యధికులు విదేశాల్లో ఉంటారు. ప్రత్యేకించి యూకే, యూఎస్ఏ, కెనడా వంటి దేశాల్లో ఉండి సంపాదిస్తుంటారు. విదేశాల్లో సంపాదిస్తూ గ్రామాలకు డబ్బులు పంపిస్తుంటారు
ప్రపంచంలోనే ధనిక గ్రామం ఈ గ్రామం ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం. అలాగని ఈ గ్రామం ఏ స్విట్డర్లాండ్ లేదా దుబాయ్ దేశంలో లేదు. ఇండియాలోనే ఉంది. గుజరాత్ కచ్ జిల్లాలోని మాధాపార్ గ్రామమిది.