Google Maps: మీ ఇంటి లొకేషన్ గూగుల్ మ్యాప్స్‌లో ఎలా సెట్ చేసుకోవచ్చో తెలుసా

ఇటీవలి కాలంలో ఎవరైనా సరే ఏ కొత్త ప్రదేశానికైనా ఇట్టే వెళ్లిపోగలుగుతున్నారు. కారణం గూగుల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్స్ సహాయంతో ఏ లొకేషన్ అయినా చేరిపోతున్నారు. మీరు మీ ఇంటి లొకేషన్ కూడా గూగుల్ మ్యాప్స్‌లో సెట్ చేసుకోవచ్చు. స్వయంగా మీరే చేయవచ్చు. కొన్ని స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఆ ప్రోసెస్ ఎలా చేయాలో తెలుసుకుందాం..

Google Maps: ఇటీవలి కాలంలో ఎవరైనా సరే ఏ కొత్త ప్రదేశానికైనా ఇట్టే వెళ్లిపోగలుగుతున్నారు. కారణం గూగుల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్స్ సహాయంతో ఏ లొకేషన్ అయినా చేరిపోతున్నారు. మీరు మీ ఇంటి లొకేషన్ కూడా గూగుల్ మ్యాప్స్‌లో సెట్ చేసుకోవచ్చు. స్వయంగా మీరే చేయవచ్చు. కొన్ని స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఆ ప్రోసెస్ ఎలా చేయాలో తెలుసుకుందాం..

1 /5

ఇంటి లొకేషన్ ఎంచుకోవాలి. మ్యాప్స్‌లో మీ ఇంటికి సంబంధించిన కచ్చితమైన లొకేషన్ ఎంటర్ చేయాలి. జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఆప్షన్ ద్వారా పిన్‌ను కచ్చితంగా సెట్ చేయాలి. ఆ తరువాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. అదనపు వివరాల కోసం అపార్ట్‌మెంట్, ఇళ్లు వంటివి చేర్చాలి. ఇప్పుడు ఫోన్ నెంబర్ ఆప్షన్‌లో ఇంటి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయవచ్చు. చివరిగా సబ్మిట్ ప్రెస్ చేస్తే చాలు. 

2 /5

ఇంటి పేరు, చిరునామా ఎంటర్ చేయాలి. నేమ్ కాలమ్‌లో ఇంటి పేరు నమోదు చేయాలి. అడ్రస్ కాలమ్‌లో మొత్తం చిరునామా ఎంటర్ చేయాలి. పిన్ కోడ్ కూడా ఎంట్రీ చేయాలి.

3 /5

యాడ్ ప్లేస్ ఎంచుకున్నాక యాడ్ ఎ మిస్సింగ్ ప్లేస్ ఆప్షన్ క్లిక్ చేయాలి.

4 /5

ఇప్పుడు కంట్రిబ్యూట్ బటన్ ప్రెస్ చేయాలి. స్క్రీన్ కింద ఎడమవైపున ఉంటుంది. ఆ తరువాత మెనూ ఓపెన్ అవుతుంది. అందులో యాడ్ ప్లేస్ ఆప్షన్ ఎంచుకోవాలి.

5 /5

ముందుగా గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేయాలి. గూగుల్ ఎక్కౌంట్ ద్వారా లాగిన్ కావల్సి ఉంటుంది.