Telangana Govt Announces Sub Committee For Employees: ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు తెలంగాణ శుభవార్త వినిపించింది. ఉద్యోగుల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉప సంఘం ఏర్పాటుతో త్వరలో సమస్యలకు పరిష్కాం లభించే అవకాశం ఉంది.
పెండింగ్: తెలంగాణ ప్రభుత్వ, ఉపాధ్యాయులకు సంబంధించి సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా డీఏలు ఐదు పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే.
పోరాటానికి సిద్ధం: ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ కలిసి ఒక జేఏసీగా ఏర్పడి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ఉద్యోగుల తీవ్ర నిర్ణయానికి స్పందించిన ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులతో సమావేశమై చర్చించింది.
ప్రభుత్వం హామీ: ఉపాధ్యాయ, ఉద్యోగులతో సమావేశమైన ముఖ్యమంత్రి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఉప సంఘం: ఇచ్చిన హామీలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాజాగా మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ముగ్గురు మంత్రులు: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబుతోపాటు కే కేశవరావుతో కూడిన ఉప సంఘం ఏర్పాటుచేశారు.
పరిష్కారానికి చొరవ: ఈ ఉప సంఘం ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగులతో సమావేశమై.. వారితో చర్చలు జరిపి నివేదిక ఇచ్చాక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందని సమాచారం.