Gold Rate Today: కనుమ రోజు బంగారం ధరలు కనికరించాయి. ఎట్టకేలకు బంగారం కొనుగోలు చేద్దామనుకునేవారికి ఊరట కల్పించాయి. చాలా రోజుల తర్వాత బంగారం ధరలు దిగివచ్చాయి. దేశీయంగా బంగారం ధరలు తగ్గగా..అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ఫ్లాట్ గానే ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today: భారతీయులకు బంగారం అంటే ఎంత మక్కువో తెలిసిందే. ముఖ్యంగా మహిళలు, పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల్లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ సమయాల్లో డిమాండ్ కు తగ్గట్లుగానే ధరలు కూడా అదే స్థాయిలో ఉంటాయని చెప్పవచ్చు. అయితే గత కొద్ది రోజులుగా పసిడి ధరలు పెరుగుతున్నాయి.
అంతర్జాతీయంగా పెరిగిన నేపథ్యంలో దేశీయంగానూ బంగారం ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ విపణిపై బంగారం ధరలు ఆధారపడి ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతాయి. అక్కడ తగ్గితే ఇక్కడ కూడా తగ్గుతాయి. అదే సమయంలో అక్కడ స్థిరంగా ఉంటే..ఇక్కడ కూడా యథాతథంగానే ఉంటాయి.
బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యేందుకు చాలా అంశాలు దోహదం చేస్తాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు అక్కడి ఆర్థిక పరిస్థితులు ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత రేటు ఇలా అన్నీ ప్రభావం చూపుతాయి.
అయితే అంతర్జాతీయంగా మార్కెట్లో బంగారం ధరలు ఏమాత్రం మారలేదు. నిన్నటి మాదిరిగానే స్థిరంగా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఇప్పుడు ఔన్సుకు 2674 డాలర్ల దగ్గర కొనసాగుతోంది. ఇదే సమయంలో స్పాట్ సిల్వర్ రేటు 29.83 డాలర్ల దగ్గర ఉంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 86.56 దగ్గర ఉంది.
దేశీయంగా అయితే కిందటి రోజుతో పోల్చితే బంగారం ధరలు దిగివచ్చాయి. హైదరాబాద్ నగరంలో తాజాగా రూ. 100 తగ్గడంతో 22క్యారెట్ల బంగారం ధర తులం 73, 300కు దిగివచ్చింది. దీనికి ముందటి రోజు రూ. 400 పెరిగింది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 110 పడిపోయింది. 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ. 79, 960కు దిగివచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు దిగివచ్చాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గింది. దీంతో తులం రూ. 73, 450 ఉంది. 24క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర 10 గ్రాములకు రూ. 80, 110 వద్ద ఉంది.