Vinayaka chavithi celebrations in AP: ఏపీలో వినాయక చవితి ఉత్సవాలపై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.
High court directions on Vinayaka chavithi celebrations in AP: ఈ సందర్భంగా ప్రైవేటు స్థలాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసిన హైకోర్టు.. పబ్లిక్ స్థలాల్లో విగ్రహాలు (Ganesh idols) పెట్టుకుని, ఉత్సవాలు నిర్వహించడంపై మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
కరోనావైరస్ వ్యాప్తి నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో వచ్చిన వినాయక చవితి పండగపై (Ganesh Chaturthi festival 2021) ఏపీ హై కోర్టు తమ అభిప్రాయం వెల్లడించింది.
బహిరంగ ప్రదేశాల్లో ఉత్సవాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం (AP govt) తీసుకున్న నిర్ణయమే సరైందని హైకోర్టు అభిప్రాయపడింది.
మత పరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కు లేనందునే ప్రైవేటు వేదికలపై వేడుకలకు అనుమతిస్తున్నట్టు హైకోర్టు (AP High court) స్పష్టం చేసింది. (Image credits : IANS photo)
కోవిడ్-19 నిబంధనలకు లోబడి ఐదుగురికి మించకుండా పూజలు (Ganesh puja vidhi) చేసుకోవాలని కోర్టు సూచించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తేల్చిచెప్పింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకునే అధికారం ఉన్నందున.. కోవిడ్ నిబంధనలు (COVID-19) పాటిస్తూ ప్రైవేటు స్థలాల్లో ఉత్సవాలు నిర్వహించుకునే వారికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించింది. Also read : Ganesh Chaturthi: వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలపై ఏపీ సర్కారుకి Pawan Kalyan ప్రశ్నలు Also read : Vinayaka Chaturthi: సీఎం జగన్ పెళ్లి రోజు వేడుకలకు కరోనా అడ్డం రాలేదా: నారా లోకేష్