Free Housing Scheme: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ఇందిరమ్మ ఇళ్ల కోరిక నెరవేరబోతోంది.. రూ.5 లక్షలు ఆ రోజు నుంచే పొందండి..

Free Housing Scheme In Telugu: తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. త్వరలోనే ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణాలు చేపట్టి అందించబోతున్నట్లు వెల్లడించింది. ఇళ్ల స్థలాలు ఉండి తట్టుకోలేని వారికి రూ.5 లక్షలపాటు ఆర్థిక సహాయం చేయబోతున్నట్లు తెలిపింది.


Free Housing Scheme In Telugu: తెలంగాణ బడుగు బలహీనవర్గాలకు, మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అంశంపై కీలక ప్రకటన చేసింది తెలంగాణ సర్కార్.. వీటి డిజైన్ ఎలా ఉండాలో? అలాగే వాటి నిర్మాణానికి కావలసిన డబ్బులు ఏయే దశల వారీగా విడుదల చేయాలో అనే విషయాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు ఈ ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే ఈ గుడ్ న్యూస్ రావడం అందరిని ఆనందపరిచింది.. 
 

1 /7

రాష్ట్రంలో మధ్యతరగతి ఇల్లు లేని వారికి సొంతింటి కల నెరవేరబోతోంది. ముఖ్యంగా మొదటి దశలో తెలంగాణ ప్రభుత్వం సొంతంగా స్థలం ఉన్నవారికి అదే జాగాలో ఇంటి ఇంటి నిర్మాణాలను మంజూరు చేస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.   

2 /7

ఇక రెండవ దశలో సొంతం స్థలం లేదా సొంతం ఇల్లు లేని వారికి కూడా ప్రభుత్వం ప్రకటించిన స్థలాల్లో కొత్త గృహాలను నిర్మించి కేటాయించబోతున్నట్లు రెవెన్యూ, గృహ నిర్మాణాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇక ప్రభుత్వం ఈ ఇళ్లకు సంబంధించిన నిర్మాణాలపై పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే..  

3 /7

నవంబర్ ఆరో తేదీ నుంచి గ్రామాల్లోని వివిధ తాండాలోని ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్న లబ్ధిదారులను అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి గుర్తించబోతున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన యాప్ను కూడా రూపొందించబోతున్నట్లు మంత్రి ప్రకటించారు.   

4 /7

ఇక నవంబర్ 15 నుంచి 20 తేదీల మధ్యల మధ్యలో గ్రామ సభల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల అర్హుల లబ్ధిదారులను గుర్తించి జాబితాను ప్రకటించబోతున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.  

5 /7

ఇందిరమ్మ ఇళ్లను కేంద్ర ప్రభుత్వం నిబంధనలు మేరకే 8 గజాల స్థలాన్ని లబ్ధిదారులకు మంచి గృహాన్ని నిర్మించి అందిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. స్థలాలు లేని వారికి ప్రభుత్వమే కొనుగోలు చేసి గృహ నిర్మాణాలు చేసి అందించబోతున్నట్లు వారు తెలిపారు.   

6 /7

ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన క్షేత్రస్థాయి పరిశీలన కోసం జిల్లాల వారీగా ప్రత్యేకమైన అధికారులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇదే అంశంపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన కూడా చేశారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు ఉన్నవారికి మళ్లీ మళ్లీ అందించబోమని తెలిపారు.   

7 /7

అలాగే ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో భాగంగా దివ్యాంగులకు ప్రత్యేకమైన కోటను అందించబోతున్నట్లు కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అలాగే ప్రతి గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల సహాయం అందించబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x