Singer Mangli: సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తనదైన జానపద పాటలతో పాటు సినిమా పాటలతో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయింది. తాజాగా ఈమె టాలెంట్ ను గుర్తిస్తూ మరో అవార్డు మంగ్లీని ఖాతాలో చేరింది. వివరాల్లోకి వెళితే..
ముందుగా ప్రముఖ ఛానెల్ లో యాంకర్ గా ప్రస్థానం మొదలుపెట్టిన మంగ్లీ.. ముందుగా కొన్ని ప్రైవేట్ సాంగ్స్ తో మొదలు పెట్టి సినిమా నేపథ్య గాయనిగా దూసుకుపోతుంది. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గీతాలకు మంగ్లీ పెట్టింది పేరు.
ఫోక్, డివోషనల్, ఐటెం సాంగ్స్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తోంది. అంతేకాదు క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రతి సాంగ్ లో తన మార్క్ చూపిస్తోంది. సింగర్ అయ్యాక వరుస ఆఫర్స్ తో స్టార్ సింగర్ గా సత్తా చూపెడుతోంది.
సింగర్ గా మంగ్లీకి సొంతగా ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో రకరకాల పాటలను పాడుతూ ఆమె కంటూ సెపరేట్ క్రేజ్ సొంతం చేసుకుంది. గత కొన్నేళ్లుగా మంగ్లీ తెలుగు సినీ ఇండస్ట్రీలో గాయనిగా తనదైన శైలిలో దూసుకుపోతుంది. జార్జి రెడ్డి మూవీలోని రాయల్ ఎన్ఫీల్డ్ సాంగ్ మంగ్లీకి ఎనలేని కీర్తి తీసుకొచ్చింది.
అనంతరం అల వైకుంఠపురంలో రాములో రాములా, లవ్ స్టోరీ చిత్రంలోని సారంగదరియాతో పాటు, ధమాకా మూవీలోని అనేక పాటలకుప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆమె తో పాడించిన పాటలు జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి.
దాంతో సినీ దర్శకులు ఆమెతో పాట పాడించడానికి రెడీ అవుతున్నారు. సినీ సంగీత ప్రపంచంలో ఆమె అందుకున్న విజయాలకు గానూ ఇటీవలే సంగీత నాటక అకాడమీ నుంచి ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్’ యువ పురస్కారానికి ఎంపికైంది.
తాజాగా న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారాన్ని అతిరథ మహారధుల సమక్షంలో సింగర్ మంగ్లీ అందుకున్నారు. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతున్న సత్యవతీ చౌహాన్ అలియాస్ మంగ్లీ ఆడబిడ్డలందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది అనడంలో ఎలాంటి సందేహం లేదు.