Sai Pallavi: షూటింగ్లో ఏడ్చేసిన సాయి పల్లవి.. కనీసం ఒక్క రోజన్నా వదిలేయండి అంటూ..!

Sai Pallavi interview:  సౌత్ ఇండియాలో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోలకి ఉన్నంత ఫాలోయింగ్ ఈ హీరోయిన్ కి కూడా ఉంది. అందుకే ఈమెను తెలుగు ప్రేక్షకులు లేడి పవర్ స్టార్ అంటారు. ఈ క్రమంలో ఈ మధ్య ఒక తెలుగు సినిమా గురించి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.
 

1 /5

శేఖర్ కమ్ములా దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో.. నిజంగానే అందరినీ ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. ప్రేమమ్ చిత్రంతో మలయాళీ ప్రేక్షకుల మనసును దోచుకున్న ఈ హీరోయిన్.. ఫిదాలో భానుమతి క్యారెక్టర్ తో తెలుగు ప్రేక్షకుల మనసుని మరింత దోచుకుంది.  

2 /5

ఆ తర్వాత నుంచి సాయి పల్లవి చేసే ప్రతి సినిమా.. ఆమె స్థాయిని పెంచుతూనే వెళ్ళింది. ఇక సాయి పల్లవి నానితో చేసిన శ్యామ్ సింగరాయ్ చిత్రం కూడా ఆమె కెరియర్ లో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో సాయి పల్లవి దేవదాసిగా కనిపించి అందరిని మెప్పించింది. 

3 /5

అయితే ఈ మధ్య గలాటా ప్లస్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి.. ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా షూటింగ్ రాత్రి మొత్తం ఉండేదని. మళ్లీ ఉదయాన్నే కాసేపు నిద్రపోయి లేచి షూటింగ్ కి వెళ్లాల్సి వచ్చేదని చెప్పింది. 

4 /5

తను ఏమైనా భరించగలనని.. రాత్రి నిద్ర లేకపోతే తన వల్ల కాదని.. కానీ వరసగా నెల రోజులు రాత్రి నిద్ర లేకుండా ఈ సినిమాకి షూటింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఒకరోజు ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు తాను ఏడ్చేసానని.. కనీసం ఒక్కరోజన్నా సెలవు దొరికితే బాగుండు అని చాలా బాధపడ్డాను అని చెప్పుకొచ్చింది. 

5 /5

కానీ తను సెలవు తీసుకోకుండానే ఆ షూటింగ్ అంతా కంప్లీట్ చేశానని…అయితే అప్పుడు పడిన బాధ తనకు ఇప్పటికీ గుర్తుందని చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి కనిపించే సీన్స్ లో.. ఎక్కువ సీన్స్ రాత్రిపూట చిత్రీకరించినవే. ఇక ఆ సీన్స్ కోసమే సాయి పల్లవి ఇంతలా కష్టపడినట్టు తెలుస్తోంది.