Rashmika Mandanna: రష్మిక తల్లిదండ్రులను చూశారా?ఎంత అందంగా ఉన్నారో..?

Rashmika Mandanna Family Photos: కన్నడ ఇండస్ట్రీకి చెందిన రష్మిక మందన్న ఇప్పుడు తెలుగులోనే కాదు తమిళ్ , హిందీ చిత్రాలలో కూడా నటిస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక అప్పుడప్పుడు తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. 

1 /5

ప్రముఖ కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో,  అందంతో,  నటనతో అతి తక్కువ సమయంలోనే నేషనల్ క్రష్ గా బిరుదు సొంతం చేసుకుంది. 

2 /5

తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోకి నాగశౌర్య హీరోగా వచ్చిన చలో సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి, మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు, విజయ్ దేవరకొండ సరసన గీతగోవిందం సినిమా చేసి మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అలా వరుస సినిమాలలో నటిస్తున్న క్రమంలోనే ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకొని, ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది.

3 /5

ఇక టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో పలువురు స్టార్ హీరోలతో కలిసి నటిస్తున్న ఈమె అనూహ్యంగా బాలీవుడ్లోకి వెళ్లిపోయి అక్కడ కూడా పలు చిత్రాలు చేస్తూ మెప్పిస్తోంది. ఇటీవలే యానిమల్ చిత్రంతో బాలీవుడ్ లో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అంటూ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె,  వ్యక్తిగత జీవితం చాలామందికి తెలియదనే చెప్పాలి. 

4 /5

నిజానికి రష్మికకు చిన్ని చెల్లెలు కూడా ఉంది. అప్పుడప్పుడు వైరల్ అయ్యే ఫ్యామిలీ ఫోటోలు చూస్తే మాత్రం రష్మిక తల్లిదండ్రులు ఇంత అందంగా ఉన్నారా అంటూ అందరూ అనకమానరు. నిజంగా రష్మిక వీళ్ళ అమ్మ నాన్న కూడా గతంలో సినిమాలలో నటించారేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉంటాయి. 

5 /5

ఇకపోతే రష్మిక 1996 ఏప్రిల్ 5న జన్మించింది. ఈమె తల్లి సుమన్ మందన్న, తండ్రి మదన్ మందన్న, సోదరి పేరు షిమాన్ మందన్న. ఇక రష్మిక తెలుగు, తమిళ్, హిందీ కన్నడ చిత్రాలలో నటిస్తోంది. అంతేకాదు నాలుగు సైమా అవార్డులతో పాటు ఫిలింఫేర్ అవార్డులు కూడా అందుకున్న ఈమె అప్పుడప్పుడు తన తల్లిదండ్రులతో ఫ్యామిలీతో కలిసి సెలెబ్రేట్ చేసుకున్న ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x