Deepika Padukone dua name controversy: బాలీవుడ్ నటి దీపికా పదుకొణే,రణ్ వీర్ సింగ్ కు ఇటీవల కూతురు పుట్టిన విషయం తెలిసిందే. ఆమెకు ఈ ప్రేమ జంట సరికొత్తగా పేరు పెట్టారు. ప్రస్తుతం ఇది కాస్త వివాస్పదంగా మారిందని చెప్పుకొవచ్చు.
దీపికా పదుకొణే, రణ్ వీర్ సింగ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, వీరిద్దరు కూడా పండంటి బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. తాజాగా, వీరిద్దరు తమ గారాల బిడ్డ పాదాల ఫోటోలను ఇన్ స్టా వేదికంగా పంచుకున్నారు
దీపికా, రణ్ వీర్ సింగ్ వినాయక నవరాత్రులలో బేబీ బంప్ తో ఫోటో షూట్ సైతం చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా.. దీపికా పదుకొణే ప్రెగ్నెంట్ గా ఉన్న కూడా.. కల్కీ మూవీలో నటించి అందర్ని ఫిదా చేశారు.
అయితే.. తాజాగా, ఈ జంటకు ఆడ బిడ్డ జన్మించింది. దీపావళి వేళ ఆమెకు తన గారాల బిడ్డకు దీపికి.. ఇన్ స్టా వేదికగా గారాల బిడ్డ ఫోటోను షేర్ చేశారు.అంతే కాకుండా.. దువా పదుకొనే సింగ్ అని పేరు పెట్టారు. అంతే కాకుండా..మా ప్రార్థనల ఫలితం అంటూ కూడా క్యాప్షన్ జతచేశారు.
అయితే.. ప్రస్తుతం దీపికాపదుకొణే, రణ్ వీర్ సింగ్ ల కూతురి పేరు తీవ్ర వివాదస్పంగా మారుతుంది. కొంత మంది నెటిజన్లు మాత్రం దువా ముస్లిం పేరే మీకు దొరికిందా అంటూ మండిపడుతున్నారు. అంతే కాకుండా.. దువా అంటే ముస్లింలు ప్రార్థనలకు పేరు.
అదే మన హిందు దేవతల పేర్లు దొరకలేదా అంటూ ఫైర్ అయినట్లు సమాచారం.. హిందువులై ఉండి.. ఇలాంటి పేరు పెట్టేందుకు మీకు మనస్సు ఎలా వచ్చిందంటూ కూడా నెటిజన్లు దీపికాను,రణ్ వీర్ సింగ్ ను ఏకీపారేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ప్రతిదాన్ని వివాదస్పదంగా తీసుకెళ్లొద్దని చెప్తున్నారు.