Daaku Maharaaj Pre Release Business: నందమూరి బాలకృష్ణ కథానాయికుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్, శ్రీకర ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కించారు. బాబీ కొల్లి డైరెక్ట్ చేసారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, రెండు ట్రైలర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చాయి. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ ఈ సినిమా వరల్డ్ వైడ్ గా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
Daaku Maharaaj Pre Release Business:ఇక బాలకృష్ణ కూడా తన కెరీర్ పరంగా మంచి ఫామ్ లో ఉన్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హాట్రిక్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. ఇపుడు పొంగల్ పోటీలో ‘‘డాకు మహారాజ్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఇప్పటికే ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అమెరికాతో పాటు హైదరాబాద్ లో జరిగింది. ఏపీలో జరగాల్సిన ఈవెంట్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో తొక్కిసలాట ఘటనతో రద్దు అయిన సంగతి తెలిసిందే కదా.
ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..తెలంగాణ (నైజాం).. రూ. 17.50 కోట్లు.. రాయలసీమ (సీడెడ్).. రూ. 15.50 కోట్లు..ఉమ్మడి ఉత్తరాంధ్ర.. రూ. 8 కోట్లు.. ఉమ్మడి తూర్పు గోదావరి.. రూ. 6 కోట్లు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి.. రూ. 5 కోట్లు.. ఉమ్మడి కృష్ణా.. రూ. 5.4 కోట్లు.. ఉమ్మడి గుంటూరు.. రూ. 7.2 కోట్లు.. ఉమ్మడి నెల్లూరు.. రూ.2.7 కోట్లు.. తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి రూ.67.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
ఓవర్సీస్.. రూ. 8 కోట్లు.. కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి..రూ. 5.40 కోట్లు.. మొత్తంగా రూ. 80.70 కోట్లు బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు బాలయ్య కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ అని చెప్పాలి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంలే రూ. 82 కోట్ల షేర్ రాబట్టాలి.
మరి సంక్రాంతి బరిలో ఇప్పటికే విడుదలైన ‘గేమ్ చేంజర్’కు నెగిటివ్ టాక్ ఈ సినిమాకు కలిసొచ్చే అంశమనే చెప్పాలి. మరోవైపు వెంకటేష్ ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమా ఉంది. ఈ సినిమాకు మినిమన్ గ్యారంటీ ఉంది. ఒక వేళ డాకు మహారాజ్ హిట్ కావాలంటే పాజిటిల్ టాక్ కంపల్‌సరీ. ఏ మాత్రం తేడా కొట్టినా.. అంతే సంగతులు.
మరి సంక్రాంతి బరిలో బాలకృష్ణ నటించిన మెజారిటీ చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సందర్భాలున్నాయి. మరి ‘డాకు మహారాజ్’ సినిమా కూడా సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ అందుకుంటుందా లేదా తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.