Curd Side Effects: పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యం బాగుంటుంది అంటారు. అందుకే చాలా మంది మధ్యాహ్నం లంచ్ తిన్న తర్వాత కచ్చితంగా చివరగా పెరుగు తింటారు. అయితే, కొంతమంది పెరుగును ఉప్పుతో తింటారు. మరికొంత మంది చక్కెరతో తీసుకుంటారు. అయితే, ఉప్పుతోపాటు పెరుగు తీసుకోవడం వల్ల మూడు వ్యాధులు మిమ్మల్ని చుట్టుముడతాయి జాగ్రత్త..
పెరుగులో ప్రోటీన్లు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కాల్షియం మన శరీరానికి అందుతుంది. పెరుగు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. తిన్న తర్వాత సులభంగా జీర్ణం అవుతుందని డైట్లో చేర్చుకుంటారు.
అంతేకాదు పెరుగుతోపాటు ఉప్పు వేసుకుని తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి కూడా పెరుగుతుంది. అందుకే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు అస్సలు తీసుకోకూడదు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా పెరుగులో ఉప్పు వేసుకుని తీసుకోకూడదు.
అయితే పెరుగులో ఉప్పు వేసుకుని తీసుకోవడం వల్ల హైబీపీ ఉన్నవారికి సైడ్ ఎఫెక్ట్ తప్పదు. పెరుగు, ఉప్పు కలిపి తీసుకోవడం బీపీ రోగులకు మంచిది కాదు. ఇలా తీసుకోకపోవడమే నయం.
పెరుగులో ఉప్పు వేసుకుని తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల మన శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. ఎందుకంటే ఇందులో సోడియం ఉంటుంది. కాబట్టి త్వరగా డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది.
(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)