Cumin For Burning Belly Fat: బెల్లీఫ్యాట్‌తో ఈ కాలంలో చాలా మంది బాధపడుతున్నారు. మారుతున్న లైఫ్‌స్టైల్, కూర్చొని ఎక్కువ సమయంపాటు పనిచేయడం, సరైన వ్యాయామం లేకపోవడం వంటివి ప్రధాన కారణం. అయితే, ఈ పొట్టకొవ్వు మొండిది. అంత ఈజీగా తగ్గిపోదు. పొట్ట చుట్టూ ఉన్న బొడ్డు కొవ్వను తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. దీనికి ఇంటి వంటగదిలో కూడా ఒక రెమిడీ ఉంది అదే జీలకర్ర. దీంతో బెల్లీఫ్యాట్ ఇట్టే కరిగిపోతుంది. ఆ ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం.
కూర్చొని ఎక్కువ సమయం పాటు పనిచేయడం లేదా కొంతమంది చిన్న వయస్సు నుంచే బెల్లీఫ్యాట్ సమస్యతో బాధపడుతుంటారు. కొంతమంది ఎంత ప్రయత్నించినా బొడ్డు కొవ్వు తగ్గించుకోలేరు. మీరు కూడా బెల్లీఫ్యాట్ కరిగించేయాలి అనుకుంటున్నారా? దానికి రామబాణం ఉంది.
మన ఇంటి వంటగదిలో జీలకర్ర ముఖ్యమైన పాత్ర. మన పూర్వకాలం నుంచి జీలకర్రను వివిధ వంటకాల్లో వినియోగిస్తాం. దీంతో జీర్ణ సమస్యలు దూరమవుతాయి. సైంటిఫిక్‌గా కూడా ఇది నిరూపితమైంది. జీలకర్రను డైట్‌లో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
జీలకర్రను తినడం వల్ల పొట్ట కొవ్వు సమస్యకు సులభంగా చెక్ పెట్టొచ్చు. అంటే ఉదయం పరగడుపున ఈ నీటిని తాగాలి. జీలకర్ర పొడిని నీటిలో వేసి బాగా ఉడికించుకోవాలి. ఆ నీరు సగం అయ్యే వరకు బాగా మరిగించాలి. దీన్ని ఉదయం పరగడుపున తీసుకోవాలి.
ఈ నీటిని తరచూ తీసుకోవడం వల్ల బొడ్డు కొవ్వు కరిగిపోవాల్సిందే. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి జీలకర్ర ఎఫెక్టీవ్ రెమిడీ.జిలకర్రలో ఉండే థైమోల్ కడుపు సమస్యలకు చెక్ పెడుతుంది.
బెల్ల ఫ్యాట్‌కు చెక్ పెట్టే జీలకర్రను ఆహారంలో వినియోగిస్తాం. అంతేకాదు ఈ జీలకర్రను మజ్జిగలో కూడా తీసుకోవచ్చు. జీలకర్ర పొడి నీటితో నేరుగా తాగలేనివారు నిమ్మరసం కలుపుకోవచ్చు. లేదా తేనె కలుపుకొని తీసుకోవాలి.
మజ్జిగ కొంతమంది భోజనం చేసిన తర్వాత తీసుకునే అలవాటు ఉంటుంది. వెంటనే జిలకర్ర పొడి కూడా వేసుకుని ఈ నీటిని తాగితే ఎన్నో ఏళ్లుగా బొడ్డు కొవ్వు తగ్గని వారికి కూడా ఇది సులభంగా తగ్గుతుంది. ఇది నేచురల్ రెమిడీ. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.
జిలకర్ర నీరు డయాబెటీస్‌తో బాధపడేవారికి కూడా ఎఫెక్టీవ్, ఉదయం పరగడపున తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాదు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలోనే ఉంటాయి.