Budhaditya Raja Yoga: బుధాదిత్య రాజయోగంతో ఈ మూడు రాశులకు పట్టిందల్లా బంగారమే.. ధనలక్ష్మి కటాక్షం..

Budhaditya Raja Yoga: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయికతో అరుదైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి యోగాల్లో బుధాదిత్య యోగానికి ప్రత్యేక స్థానం ఉంది. వచ్చే నెలలో కుంభ రాశిలో  రవి, బుధుడు కలిసి ఉండటం వలన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. దీని వలన 12 రాశుల వారి జీవితాలపై పెను ప్రభావాలు చూపనున్నాయి.

1 /5

 Budhaditya Raja Yoga: వచ్చే నెల ఫిబ్రవరిలో మరోసారి సూర్యుడు, బుధుడు కలిసి బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతుంది. దీని వలన కొన్ని రాశుల వారికీ ప్రత్యేక ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఈ రాజయోగంతో, ఈ మూడు రాశుల వారి వృత్తి, వ్యాపారాలలో అనుకోని  పురోగతిని చూస్తారు. అంతేకాదు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది.

2 /5

కుంభ రాశి.. కుంభరాశి వారికి  సూర్యుడు,  బుధుడు కలయిక వల్ల పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. అంతేకాదు ఇపుడు మీకు సమయం అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. ఈ కాలంలో మీరు సమాజంలో  గౌరవ ప్రతిష్టలు అందుకుంటారు.   కొత్త వ్యక్తులతో మీ సంబంధాలు బలపడుతాయి. మీ మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. పెళ్లి కానీ వారికీ ఈ యేడాది పెళ్లి పీఠలు ఎక్కడం ఖాయం. పెళ్లైన వారికి జీవిత భాగస్వాముల నుండి మద్దతు లభిస్తుంది.  ఈ సమయం మీకు ఆరోగ్య పరంగా ఎంతో అనుకూలంగా ఉండబోతుంది.  

3 /5

మిథున రాశి.. కుంభ రాశిలో ఏర్పడే బుధాదిత్య రాజయోగంతో మిథునం వారికి మంచి ఫలితాలు అందుకుంటారు. అదృష్టం కలిసొచ్చే అవకాశాలున్నాయి. ఈ కలయిక వలన  విదేశాలకు వెళ్లగలరు. ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం ధ్యానం చేయడం ఉత్తమ ఫలితాలను అందిస్తోంది. వ్యాపారస్తులకు ప్రత్యేక ఆర్ధిక ప్రయోజనాలు కలగబోతున్నాయి. అనవసర ఖర్చులకు కళ్లెం వేయాలి. 

4 /5

మేష రాశి.. బుధాదిత్య రాజయోగంతో మేషరాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉండబోతుంది. ఈ యోగం వలన మేష రాశి వారికి ఆదాయం పెరుగుతోంది. కొత్తగా ఆదాయ వనరులు సమకూరుతాయి. అంతేకాదు పూర్వీకుల ఆస్తులు కలిసొచ్చే అవకాశాలున్నాయి. మీరు వ్యాపారంలో ఎక్కువ లాభం పొందే అవకాశాలున్నాయి.  స్థానికుల కష్టానికి పూర్తి ఫలితం దక్కుతుంది.  కొత్త ఉద్యోగ అవకాశాలు పొందుతాు. ఈ కాలంలో వ్యాపారులు అతిపెద్ద లాభాలను పొందుతారు.

5 /5

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్కులు, పంచాంగాలు, మత గ్రంథాల ఆధారంగా ఇవ్వబడింది. జీ న్యూస్ దీనిని ధృవీకరించడం లేదు.