bsnl recharge plan: కొన్ని రోజులుగా కస్టమర్లకు టెలికాం కంపెనీలు ఊహించని షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే జీయో, ఎయిర్ టెల్ కంపెనీలు తమ మొబైల్ రీచార్జీ ధరలను భారీగా పెంచేశాయి. ఈ క్రమంలో దేశ వాప్తంగా కస్టమర్లు దీనిపై తమ నిరసనలన తెలియజేస్తున్నారు.
కొన్నిరోజులుగా టెలికాం కంపెనీలు వరుసగా కస్టమర్లకు షాకింగ్ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. జియో, ఎయిర్ టెల్ కంపెనీలు తమ రిచార్జీ ధరలను అమాంతం పెంచేశాయి. దీంతో కస్టమర్లు సోషల్ మీడియా వేదికగా తమ నిరసనలను తెలియజేస్తున్నారు. అంతేకాకుండా.. దీనిపై తమ నిరసనలు కూడా తెలియజేస్తున్నారు.
ఇప్పటికే జియో బాటలోనే ఎయిర్ టెల్ సైతం.. రిచార్జీ ధరలను అమాంతం పెంచేశాయి. ఈ క్రమంలో..దీనిపై కస్టమర్లు ఇక బీఎస్ఎన్ఎల్ కు మారుతామని కూడా సోషల్ మీడియాలో తమ నిరసనలు తెలియజేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే జియో, ఎయిర్ టెల్ లు కస్టమర్లకు వరుస షాక్ లు ఇచ్చాయి. ఇక సోషల్ మీడియాలో కొందరు అంబానీ తమ కొడుకు పెళ్లి ఖర్చులను, కస్టమర్ల దగ్గర నుంచి గుంజుతున్నాడా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్లను ఆకర్శించేందుకు వెరైటీ ప్లాన్ లతో మరోసారి ముందుకు వచ్చింది.45 రోజుల కాల వ్యవధితో.. అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, 100 ఫ్రీ ఎస్ఎమ్మెఎస్ లతో రూ. 249 ప్లాన్ లను కొత్తగా తీసుకొచ్చింది.
ప్రస్తుతం టెలికాం కంపెనీలు వరుసగా తమ టారీఫ్ లను పెంచిన నేపథ్యంలో,బీఎస్ఎన్ఎల్ మరోసారి కస్టమర్లను ఆకర్శించే విధంగా ఈ ప్లాన్ ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
ప్రముఖ టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియా జూలై నుండి తమ మొబైల్ టారిఫ్ ప్లాన్లను పెంచనున్నట్లు ప్రకటించాయి. కొత్త మొబైల్ ప్లాన్లు రిలయన్స్ జియోకి జూలై 3 నుండి అమలులోకి రాగా, వొడాఫోన్ ఐడియాకు జూలై 4 నుండి అమలులోకి వస్తుంది.