Sara Ali Khan: క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కు అంతా సిద్ధమవుతున్నారు. హాలీ డే సందర్భంగా అందరూ తమ ప్లాన్స్ రెడీ చేసుకున్నారు. బాలీవుడ్ భామ సారా అలీ ఖాన్ ఈ క్రిస్మస్కు తన చెక్ లిస్ట్‌ను షేర్ చేశారు. క్రిస్మస్ను హాయిగా.. ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకోవాలని కోరారు.
ఇంటిని వింటర్ వరల్డ్‌గా మార్చుకోవాలని.. ఫెయిరీ లైట్లు వేసుకోవాలని ఈ భామ చెబుతున్నారు. ఇంటి నిండా దండలు వేలాడసి.. ఆభరణాలతో క్రిస్మస్ చెట్టును అలంకరించాలని అంటున్నారు ఐటీసీ ఫియామా బ్రాండ్ అంబాసిడర్ సారా అలీ ఖాన్.
మీకు ఇష్టమైన వారికి ప్రత్యేకమైన గిఫ్ట్స్ ఇవ్వాలని.. అవి వారి వ్యక్తిత్వాలను నిజంగా ప్రతిబింబించేలా ఉండాలని అన్నారు. చేతితో రాసిన కార్డ్ అయినా.. ఫోటో ఫ్రేమ్ అయినా లేదా క్యూరేటెడ్ బహుమతి సెట్ అయినా ఇవ్వాలని ఈ భామ సూచిస్తున్నారు.
సంతోషంతో నిండిన ఉత్సాహభరితమైన నూతన సంవత్సరానికి వేదికను ఏర్పాటు చేసే ప్రతిష్టాత్మకమైన, ఆత్మీయమైన వాటిని బహుమతిగా ఇవ్వడంలో ఉన్న ఆనందం వంటిది మరొకటి లేదంటూ ఈ భామ చెప్పుకొచ్చారు.
మీకు ఇష్టమైన హాలిడే సినిమాలతో పాటు పండుగ సమావేశాన్ని హోస్ట్ చేయాలని లేదా మీరు వెళ్లి చేరాలని అన్నారు.
సరదాగా ఆటలు ఆడుకుంటూ.. అందరికతో కలిసి నవ్వుకుంటూ.. మంచి ఫుడ్‌తో సాయంత్రం వేళ ప్రశాంతంగా ఉండలని చెబుతున్నారు ఈ బ్యూటీ.