Investment Tips: విభిన్న మార్గాల్లో పెట్టుబడి పెట్టి..తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం సమకూర్చుకోవాలని ఆలోచిస్తున్నారా..అయితే ఇది మీ కోసమే. ట్యాక్స్ మినహాయింపు, మంచి రిటర్న్స్ ఇచ్చే కొన్ని స్కీమ్స్ గురించి వివరాలు అందిస్తున్నాం..
పీపీఎఫ్ దీర్ఘకాలపు పెట్టుబడి స్కీమ్. దీనికోసం సమీప బ్యాంకు లేదా పోస్టాఫీసులో పీపీఎఫ్ ఎక్కౌంట్ ఓపెన్ చేయాలి. 15 ఏళ్లలో మెచ్యూరిటీ ఉంటుంది. ఈ ఎక్కౌంట్లో ప్రతి ఏటా కనీసం 500, అత్యధికంగా 1.5 లక్షలు జమ చేయవచ్చు.
పోస్ట్ ఆఫీసు మంత్లీ ఇన్కం స్కీమ్ అనేది చాలా మంచిది. పోస్టాఫీసులో పెట్టుబడి అనేది చాలా సురక్షితమైంది. ప్రతినెలా ఫిక్స్డ్ ఆదాయం వస్తుంది. రిటర్న్ గ్యారంటీ ఉంటుంది. ఇందులో 1500 నుంచి 4.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు.
ఐదేళ్లు, పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే..చాలా మ్యూచ్యువల్ ఫండ్స్ ఉన్నాయి. తక్కువ వ్యవధికై డేట్ ఫండ్ లేదా లిక్విడ్ ఫండ్ ఎంపిక చేసుకోవచ్చు. దీర్ఘకాలం కోసం ఈక్విటీ మ్యుచ్యువల్ ఫండ్ సరైంది.
పెట్టుబడి పెట్టేందుకు గోల్డ్ అత్యంత నమ్మకమైందిగా చెప్పవచ్చు. బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు పేపర్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్, సావరీన్ గోల్డ్ బాండ్, గోల్డ్ మ్యూచ్యువల్ ఫండ్ , డిజిటల్ గోల్డ్ మంచి ప్రత్యామ్నాయాలు.
ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కూడా ఇన్వెస్ట్ కోసం మంచి ప్రత్యామ్నాయం. మీరు ఏదైనా కంపెనీ ఉద్యోగి అయితే..జీతంలో కొంతభాగం ఈపీఎఫ్ఓలో పెట్టవచ్చు. మీరెంత పెడితే అంత కంపెనీ నుంచి ఉంటుంది. ఈపీఎఫ్ఓలో ఏడాదికోసారి వడ్డీ వస్తుంది.
ఎస్బీఐ మ్యూచ్యువల్ ఫండ్ మంచి అవకాశం. ఇందులో 100కు పైగా మ్యూచ్యువల్ ఫండ్స్ ఉన్నాయి. దేశంలో అతిపెద్ద మ్యూచ్యువల్ ఫండ్ కంపెనీ ఇది. మ్యుచ్యువల్ ఫండ్ ద్వారాషేర్ మార్కెట్లో కాకుండా డేట్, గోల్డ్, కమోడిటీల్లో పెట్టుబడజి పెట్టవచ్చు.