Astro Tips: ఏ పువ్వుతో ఏ దేవుడిని పూజిస్తే మంచిది? ఈ పూలతో పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయి

Hindu Religious Beliefs: హిందూ మతవిశ్వాసాల ప్రకారం పువ్వులు లేకుండా పూజలు చేయడం అసంపూర్ణం. పూజలో పువ్వులదే ప్రముఖ స్థానం. ఏ దేవుడికి ఏ పువ్వులంటే ఇష్టమూ తెలుసా. ఆ పూలతో పూజిస్తే మీరు కోరిన కోరికలు నెరవేరడంతోపాటు అష్టైశ్వరాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. 
 

1 /8

Hindu Religious : సాధారణంగా పూజ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పువ్వులు. పువ్వులు లేని పూజను ఊహించలేము. పువ్వులు లేకుండా పూజ చేస్తే అసంపూర్ణంగానే ఉంటుంది. అందుకే చాలా మంది రంగురంగుల పువ్వులతో తమ ఇష్టదైవాన్ని పూజిస్తుంటారు. భక్తులకు ఇష్టమైన దేవుళ్లు ఉన్నట్లే... ఆ దేవుళ్ల కూడా ఇష్టమైన పువ్వులు ఉంటాయి. ఒక్కో దేవుడు ఒక్కో పువ్వును ఇష్టపడుతాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ పువ్వులు లేకుండా చేసే పూజ పూజనే కాదు. మరి ఏ పువ్వుతో ఏ దేవుడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు చూద్దాం.   

2 /8

త్రిమూర్తులలో ఒకరైన మహావిష్ణువును తులసి, కిస్కార పుష్పాలతో పూజించడం అత్యంత శ్రేయస్కరం. తులసి తల్లి లక్ష్మీదేవిని సూచిస్తుంది.  

3 /8

 శ్రీకృష్ణుడిని పూజించేటప్పుడు తులసి, పారిజాత పుష్పం ఉండాలి. క్లీరసాగర మథనం జరిగిన సమయంలో పారిజాత వ్రుక్షం పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి. దాన్ని విష్ణువు తనతోపాటు స్వర్గానికి తీసుకెళ్లారని చెబుతుంటారు.   

4 /8

దుష్టనాశకుడైన వినాయకునికి పటిక పూల దండ ఉత్తమం. వినాయక ఉత్సవాల్లో, వినాయక విగ్రహానికి పూలమాల వేయడం చూడవచ్చు. ఇది వాస్తు దోషాన్ని కూడా సరిచేస్తుంది.  

5 /8

ఆంజనేయుడికి మల్లెపూలంటే చాలా ఇష్టం. ఆంజనేయుడిని మల్లెపూలతో పూజిస్తే ప్రసన్నుడవుతాడు.  

6 /8

దుర్గా దేవి, కాళి, చాముండి దేవితో సహా అమ్మవారి ఆరాధనలో ఎరుపు రంగు దశవాలాలను శ్రేష్ఠమైనదిగా భావిస్తారు.  

7 /8

శివుడిని పూజించే భక్తులు ఉమ్మెత్త పువ్వులతో పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉమ్మెత్త చెట్లకు గుండ్రంగా ముళ్లతో ఉన్న కాయల్లాంటి పువ్వులు కాస్తాయి. అవంటే శివుడికి చాలా ఇష్టం.   

8 /8

నీలిరంగు పువ్వులంటే శనిదేవుడికి ఇష్టం. అందుకే శనిదేవుడికి నీలిరంగు పువ్వులు సమర్పించాలి. నీలం శంఖం పువ్వుతో సహా ఇతర నీలం పుష్పాలను శనిదేవుడికి సమర్పించవచ్చు.