Ananya Nagalla: ఉగాది వేళ పండగ కళతో ఉట్టిపడుతున్న అనన్య నాగళ్ల.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Ananya Nagalla: అనన్య నాగళ్ల అచ్చ తెలుగు అందం. తెలుగులో చేనేత కార్మికుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవితకథతో తెరకెక్కిన  మూవీతో కథానాయికగా పరిచయం అయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'వకీల్ సాబ్‌'లో లీడ్ రోల్‌తో ఓవర్ నైట్ పాపులర్ అయింది. ఈ రోజు ఉగాది పర్వదినం సందర్భంగా సాంప్రదాయ లంగా ఓణీలో కనిపించి అభిమానులను కనువిందు చేసింది.

1 /6

అనన్య నాగళ్ల ఎన్ని సినిమాల్లో రానీ గుర్తింపు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్‌ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మాస్‌లో ఈమె పేరు మారిమోగేలా చేసింది.

2 /6

అనన్య నాగళ్ల కేవలం హీరోయిన్‌ పాత్రల కోసం ఎదురు చూడకుండా.. క్యారెక్టర్ డిమాండ్ మేరకు నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది

3 /6

నితిన్ మేస్ట్రోతో పాటు సమంత శాకుంతలం సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేసినా.. అనన్యకు పెద్దగా ఉపయోగపడలేదు.

4 /6

అనన్య నాగళ్ల తెలంగాణ ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఈమె జన్మస్థలం. అంతేకాదు ఇబ్రహీం పట్నానికి చెందిన రాజా మహేంద్ర కాలేజీలో ఇంజినీరింగ్  చదివింది.

5 /6

సినిమాల్లో రాకముందు ఈమె ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇన్ఫోసిస్‌లో కొంత కాలం పనిచేశారు. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసింది.

6 /6

అనన్య నాగళ్ల కెరీర్ షురూలో పలు షార్ట్ ఫిల్మ్స్‌లో యాక్ట్ చేసింది. అందులో ఈమె నటించిన 'షాదీ' అనే షార్ట్ సినిమాలో నటనకు సైమా అవార్డ్‌కు నామినేట్ అయింది. ఈ యేడాది తంత్ర మూవీతో పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ  మోస్తరు విజయం సాధించింది.