CSK New Captain: ఐపీఎల్ ట్రోఫీని ఐదుసార్లు గెల్చుకున్న చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు మహీంద్ర సింగ్ ధోనీ మరోసారి ఆడతారా లేదా అనేది ఇంకా నిర్దారణ కాలేదు. ఈలోగా సీఎస్కే మాజీ ఆటగాడు అంబటి రాయుడు సీఎస్కే తదుపరి సారధి గురించి చెప్పిన జోస్యం వైరల్ అవుతోంది.
CSK New Captain: ఐపీఎల్ 2023 విజయంతో ఐదుసార్లు టైటిల్ గెల్చుకున్న చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు సారధి మహీంద్ర సింగ్ ధోని ఆ జట్టుకు పెద్దవరం. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే సత్తా ఉండటమే కాకుండా...క్లిష్ట సమయాల్లో అద్భుతమైన కెప్టెన్సీ ప్రదర్శించగల సామర్ధ్యమున్నవాడు. సీఎస్కేకు ఈసారి కెప్టెన్ ఎవరు, అంబటి రాయుడు ఏమంటున్నాడు..
రుతురాజ్ గైక్వాడ్ టీమ్ ఇండియాకు ఇప్పటి వరకూ 1 వన్డే, 9 టీ20లు ఆడాడు. వన్డేలో 19 పరుగులు, టీ20ల్లో 135 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది.
రుతురాజ్ గైక్వాడ్‌కు చైనాలో జరిగే ఏసియన్ గేమ్స్ 2023కు టీమ్ ఇండియా కెప్టెన్‌గా ఎంపిక చేశారు. రుతురాత్ గైక్వాడ్ మూడు క్రికెట్ ఫార్మట్లలో టీమ్ ఇండియాకు ఆడాలని అంబటి ఆశించాడు.
రుతురాత్ గైక్వాడ్ సీఎస్కే జట్టుకు పదేళ్ల కంటే ఎక్కవ సమయమే కెప్టెన్‌గా వ్యవహరించవచ్చని కూడా అంబటి చెప్పడం విశేషం.
సీఎస్కే మాజీ ఆటగాడు అంబటి రాయుడు ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. సీఎస్కే భవిష్యత్ గురించి మాట్లాడాల్సి వస్తే రుతురాజ్ సరైన ప్రత్యామ్నాయమని చెప్పాడు అంబటి రాయుడు. అతడిలో కెప్టెన్ సామర్ద్యం ఉందని చెప్పాడు.
అంబటి రాయుడు అంచనాల ప్రకారం చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సీఎస్కే తదుపరి కెప్టెన్ కాగలడు. గత కొద్దికాలంగా సీఎస్కే ప్రదాన ఆటగాళ్లలో ఒకడిగా రుతురాజ్ ఉంటున్నాడు.