Allu Arjun: ఇంటికి కాకుండా ముందుగా గీతా ఆర్ట్స్‌కు చేరుకున్న అల్లు అర్జున్‌.. ఎందుకో తెలుసా?

Allu Arjun At Geeta Arts: నేడు ఉదయం జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్‌ నేరుగా ఇంటికి కాకుండా గీతా ఆర్ట్స్‌కు వెళ్లారు. ఆయనతోపాటు అక్కడకు అల్లు అరవింద్‌, బన్నీ మామ కూడా ఉన్నారు. ముందుగా అల్లు అర్జున్‌ గీతా ఆర్ట్స్‌కు ముందుగా ఎందుకు చేరుకున్నారో ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /7

అల్లు అర్జున్‌ చంచల్‌ గూడ జైలు నుంచి ఈరోజు ఉదయం 6:30 నిమిషాల సమయంలో విడుదలయ్యారు. ఆయన పుష్ప2 సినిమా ప్రీమియర్‌ షో లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో బన్నీని అరెస్ట్‌ చేశారు.  

2 /7

అయితే, జైలు నుంచి విడుదలైన బన్నీ నేరుగా గీతా ఆర్ట్స్‌కు బయలు దేరారు.  నిన్న బన్నీ అరెస్ట్ అయిన తర్వాత స్నేహ పుట్టింటికి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అక్కడ నుంచి తిరిగి ఇంటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.  

3 /7

అల్లు అర్జున్‌ గీతా ఆర్ట్స్‌ వరకు ఎస్కార్ట్‌ వాహనం ద్వారా ఆయన్ను చేర్చారు. అయితే, కోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినా బన్నీ విడుదలలో  జాప్యం జరిగిందని దీనిపై న్యాయపోరాటం చేస్తామని బన్నీ తరఫు లాయర్ చెప్పారు.  

4 /7

గీతా ఆర్ట్స్‌ వద్ద అల్లు అర్జున్‌ మామ, అల్లు అరవింద్‌ కూడా తన వెంటే ఉన్నారు. అయితే ఇతర ప్రముఖులు కూడా వచ్చి ఆయన్ను కలిసే అవకాశం ఉంది.   

5 /7

ఇప్పటికే రానా వంటి ప్రముఖులు కూడా గీతా ఆర్ట్స్‌ వద్దకు చేరుకుంటున్నారు. ఇతర సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్‌ను కలిసే అవకాశం ఉంది. కాబట్టి గీతా ఆర్ట్స్‌ అయితే, విశాలంగా ఉంటుంది. అది అనువు అని అక్కడ ఉన్నారు బన్నీ.  

6 /7

మరోవైపు బెయిల్‌ కాపీలో కొన్ని తప్పిదాలు ఉన్నాయి. అందుకు జాప్యం జరిగింది. ఆ తర్వాత ఆన్‌లైన్‌ కాపీతోపాటు మరో ఫిజికల్‌ కాపీ కూడా సబ్మిట్‌ చేసే వరకు ఆలస్యమైంది.   

7 /7

రాత్రంతా అల్లు అర్జున్‌ మంజీరా బ్యారక్‌ లో ఉన్నారు. వీఐపీ కేటగిరీ ప్రోటోకల్‌ ప్రకారమే ఇచ్చారట. అయితే, ఆయన సాధారణ ఖైదీలా మాత్రమే ఉండటానికి మొగ్గు చూపారు.అయితే, ఈ మధ్యంతర బెయిల్ కేవలం నాలుగు వారాలు మాత్రమే వర్తిస్తుంది.