Sharada Peetham: భూమి రద్దు తర్వాత వైఎస్ జగన్ సంచలనం.. శారదా పీఠం సందర్శన

Ex CM YS Jagan Visits Sharada Peetham: రాజకీయ పరిణామాలు మారిన తర్వాత మాజీ ముఖ్యమంత్రిగా తొలిసారి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శారదా పీఠాన్ని సందర్శించారు. చంద్రబాబు శారదా పీఠం భూములు రద్దు చేసిన తర్వాత జగన్‌ సందర్శించడం రాజకీయంగా కలకలం రేపింది. ఆయన పర్యటనకు భారీ ఎత్తున స్పందన లభించింది.

1 /6

సంచలన పర్యటన: అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శారదా పీఠాన్ని సందర్శించడం సంచలనంగా మారింది.

2 /6

శారదా పీఠం: విజయవాడ గాంధీనగర్‌ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో ఉన్న శ్రీ శృంగేరీ శారదా పీఠాన్ని వైఎస్‌ జగన్‌ సందర్శించారు.

3 /6

ప్రత్యేక పూజలు: జగద్గురువు శ్రీ విధుశేఖర భారతి స్వామీజీ వైఎస్‌ జగన్‌ కలిసి ఆశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా పీఠంలో ప్రత్యేక పూజలు చేశారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

4 /6

భూముల రద్దు: శారదా పీఠం సందర్శన రాజకీయంగా కలకలం రేపింది. చంద్రబాబు ప్రభుత్వం శారదా పీఠం భూములు కేటాయించిన తర్వాత జగన్‌ శారదా పీఠం సందర్శించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

5 /6

మాజీ సీఎంగా: ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్‌ జగన్‌ విశాఖపట్టణంలో శారదా పీఠానికి భూములు కేటాయించారు.

6 /6

భారీగా నాయకులు: ఈ పర్యటనలో వైఎస్‌ జగన్‌ వెంట ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్, నాయకులు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాశ్‌ తదితరులు ఉన్నారు.