Sharada: అందరూ స్వార్థపరులే…బాలయ్య మాత్రమే రియల్ హీరో.. శారద ఆసక్తికర వ్యాఖ్యలు..!

Sharada recalls an event : ఇటీవల ఒక సినిమా ఈవెంట్ జరగగా..  ఆ ఈవెంట్లో ప్రముఖ సీనియర్ హీరోయిన్ శారద మాట్లాడుతూ.. బాలయ్య రియల్ హీరో అంటూ ఒకరోజు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు ఆరోజు ఎంతోమంది ప్రముఖులు ఉన్నా కానీ బాలకృష్ణ మాత్రమే స్పందించారు అందు కీలక వ్యాఖ్యలు చేసింది ఈ సీనియర్ నటి.
 

1 /5

ప్రముఖ సీనియర్ హీరో బాలకృష్ణ అతి తక్కువ.. సమయంలోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్నప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన గత ఏడాది ఇండస్ట్రీలోకి వచ్చి 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు కూడా. ఈ సందర్భంగా గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించి, బాలకృష్ణను సత్కరించిన విషయం తెలిసిందే.

2 /5

ఇక ఆరు పదుల వయసు దాటినా…సరే ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా యంగ్ డైరెక్టర్లను లైన్ లోకి తీసుకొస్తూ.. మాస్ ఆడియన్స్ టార్గెట్గా యాక్షన్ సన్నివేషాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలయ్య. అందులో భాగంగానే అఖండ సినిమా.. మొదలుకొని ఇటీవల వచ్చిన డాకు మహారాజ్ వరకు అన్నీ మాస్ యాక్షన్ పర్ఫామెన్స్ తో వచ్చినవే. 

3 /5

ఈ సినిమాలన్నీ కూడా మంచి విజయాన్ని అందించి బాలయ్య స్టేటస్ ను మరింత పెంచేసాయి. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఫంక్షన్ నిర్వహించగా.. అందులో తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు ప్రముఖ సీనియర్ హీరోయిన్ శారదా కూడా పాల్గొన్నారు. అందులో భాగంగానే బాలయ్య రియల్ హీరో అంటూ చెప్పి ఆయనపై ప్రశంసలు కురిపించింది. 

4 /5

శారదా మాట్లాడుతూ.. ఒక 15 సంవత్సరాల క్రితం బాలయ్యకు ఈ విషయం గుర్తుందో లేదో నాకు తెలియదు. నాకు మాత్రం చాలా బాగా గుర్తుంది. తిరుపతి నుంచో లేక చెన్నై నుంచో ఒక ఫ్లైట్ రావాల్సి ఉంది. కానీ ఇంజన్లో కాస్త ట్రబుల్ ఇవ్వడంతో ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత కాస్త ఇబ్బంది పడింది. ఆ సమయంలో పెద్ద పెద్ద వాళ్లంతా కూడా అయ్యో మేమే ఏమైపోతామో.. మా పిల్లలు ఏమైపోతారో అంటూ ఏడవడం మొదలుపెట్టారు.

5 /5

అయితే ఇందులో చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. కానీ వారందరి పేర్లు చెప్పకూడదు. ఆరోజు అందరూ గగ్గోలు పెడుతుంటే, బాలయ్య మాత్రం రియల్ హీరో అనిపించుకున్నారు. వాళ్లకు కావలసిన నీళ్లు అన్ని అవసరాలను స్వయంగా తీర్చి వాళ్ళందరినీ శాంతింప చేశారు. అప్పుడు రీల్ హీరో కాదు రియల్ హీరో అనిపించుకున్నారు అంటూ బాలయ్య నిజస్వరూపాన్ని బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది శారద. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.