New Labour Code : వారంలో నాలుగు రోజులే పని... కొత్త ఏడాదిలో సరికొత్త కార్మిక విధానం..

4 day work week, change in salary : ఇప్పటికే చాలా కంపెనీలు ఐదు రోజుల పని విధానంలో నడుస్తున్నాయి. అయితే ఆ విధానం మారనుంది. వారానికి నాలుగు రోజులే పని అనే కొత్త విధానం రానుంది. కేంద్ర ప్రభుత్వం ఈ విధానం అమలు చేయాలని భావిస్తోంది. 

  • Dec 21, 2021, 19:30 PM IST

4 day work week change in salary What New Labour Codes have in store : కొత్త ఏడాదిలో మనదేశంలో కొత్త పని విధానాన్ని అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విధానం ద్వారా ప్రతి ఉద్యోగి నాలుగు రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. మూడు రోజులు వీకాఫ్‌గా తీసుకునే వెసులుబాటు కలుగుతుంది.

1 /10

కొత్త ఏడాదిలో మనదేశంలో కొత్త పని విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే కొత్త కార్మిక విధానం రూపొందింది. 

2 /10

భారత్‌లో కొత్త కార్మిక విధానం అమల్లోకి వస్తే ఉద్యోగులు వారంలో నాలుగు రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. వారంలో మూడు రోజులు వీకాఫ్‌గా ఉద్యోగులు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. 

3 /10

కేంద్రం కొత్త సంవత్సరంలో నాలుగు కొత్త లేబర్ కోడ్స్‌ను అమలు చేయాలని యోచిస్తోంది. కేంద్ర ఇప్పటికే వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, ఆరోగ్యం, పని చేసే పరిస్థితులకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంది. (Pic source : Reuters)

4 /10

కార్మిక వ్యవస్థ కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలోని అంశం కావడంతో కొత్త లేబర్ కోడ్స్ అమలుపై మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్రాలను కోరింది కేంద్ర ప్రభుత్వం.

5 /10

కొత్త వేతన విధానం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీత విధానాల్లో మార్పులు వస్తాయి. వేతనాల్లో బేసిక్‌పేతో పాటు డీఏ, రిటెన్షన్ పేమెంట్‌లు ఉంటాయి. (Pic source : Reuters)

6 /10

న్యూ లేబర్ కోడ్ ద్వారా ఉద్యోగికి చేతికి వచ్చే జీతాన్ని తగ్గించి.. ఆ అమౌంట్‌ ద్వారా పీఎఫ్, గ్రాట్యూటీ మొత్తాన్ని పెంచాలని చూస్తున్నారు.

7 /10

 కొత్త లేబర్ కోడ్‌లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2022-23లో అమలులోకి వచ్చే అవకాశం ఉంది. (Source: PTI)

8 /10

ఫిబ్రవరి 2021లో ఈ కోడ్‌లకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను ఖరారు చేసే ప్రక్రియను కేంద్రం పూర్తి చేసింది. 

9 /10

 కార్మిక విధానం అనేది ఉమ్మడి సబ్జెక్ట్ కావడంతో రాష్ట్రాలు కూడా వీటిని ఒకేసారి అమలు చేయాలని కేంద్రం కోరుతోంది.

10 /10

ఏప్రిల్ 2021 నుంచే కొత్త లేబర్ కోడ్‌లను అమల విధానంపై కేంద్రం కసరత్తు చేయడం ప్రారంభించింది.