Kabzaa OTT : థియేటర్లో అంతంతమాత్రంగా ఆడిన సినిమాలు ఓటీటీలోకి.. కబ్జా, ధమ్కీలు ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

Das Ka Dhamki OTT Release Date విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ సినిమా థియేటర్లో ఓ మోస్తరుగా ఆడిన సంగతి తెలిసిందే. కిందా మీద పడితే బ్రేక్ ఈవెన్ అయిందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 12, 2023, 10:05 PM IST
  • ఓటీటీలో కొత్త సినిమాల సందడి
  • ఓకే అనిపించిన విశ్వక్ సేన్ ధమ్కీ
  • బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ కబ్జా
Kabzaa OTT : థియేటర్లో అంతంతమాత్రంగా ఆడిన సినిమాలు ఓటీటీలోకి.. కబ్జా, ధమ్కీలు ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

Das Ka Dhamki OTT Release Date ప్రతీ వారం ఓటీటీ, థియేటర్లకు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ మధ్య ప్రతీ సినిమా వారం కంటే ఎక్కువగా ఆడటం లేదు. సినిమా మరీ బాగుంటే తప్పా రెండో వారంలోకి అడుగు పెట్టడం లేదు. ఇక బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం మూడు, నాలుగు వారాలు ఆడుతున్నాయి. అయితే ఇప్పుడు థియేటర్లో ఆడని సినిమాలు ఓటీటీలో ఆడుతున్నాయి. థియేటర్, ఓటీటీ రెండింట్లోనూ కొన్ని సినిమాలు సత్తా చాటుతున్నాయి.

విశ్వక్ సేన్ హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. చివరగా మాస్ మసాలా కమర్షియల్ యాంగిల్‌లో ఆడియెన్స్‌ను మెప్పించేందుకు వచ్చాడు. దాస్ కా ధమ్కీ అంటూ దుమ్ములేపేందుకు వచ్చాడు. ప్రమోషన్స్‌లో సినిమా గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు అనేది అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి విశ్వక్ సేన్ చెప్పినంతగా అయితే లేకపోవడం నిరాశ కలిగించిందని అభిమానులు పెదవి విరిచారు.

ధమ్కీ సినిమా మిక్స్డ్ టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ వద్ద బ్రేక్ ఈవెన్ కొట్టేందుకు కిందా మీదా పడింది. అయితే సినిమా ఎండింగ్‌లో సీక్వెల్‌ రాబోతోందనే హింట్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. దమ్కీ పార్ట్ 2 కూడా రాబోతోందని ప్రకటించేశాడు విశ్వక్ సేన్. ధమ్కీ సినిమా బ్రేక్ ఈవెన్ దాటడంతో సీక్వెల్ వస్తుందనే అంతా ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ఈ సినిమా ఆహాలోకి వచ్చేస్తోంది. ఏప్రిల్ 14 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది.

Also Read:  Samantha : సమంత ఆంటీ ఇంకా రెండు రోజులే ఉంది!.. సామ్ రిప్లై ఇదే

కన్నడ నుంచి వచ్చిన సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియన్ రేంజ్‌లో ఎలా ఆడేస్తోన్నాయో అందరికీ తెలిసిందే. అయితే కేజీయఫ్ ఫార్మాట్‌లో తెరకెక్కించిన కబ్జా సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. ఈ సినిమా థియేటర్లో ఆడలేదు. ఏప్రిల్ 14 నుంచి కన్నడ, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అమెజాన్‌లో అందుబాటులోకి రాబోతోంది.

Also Read: Renu Desai : పవన్ కళ్యాణ్‌ ఎందుకు స్పందించడు?.. నిలదీసిన నెటిజన్.. రేణూ దేశాయ్ రిప్లై వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News