IPL 2023 CSK Vs RR Dream11 Team Prediction: ఐపీఎల్ 2023లో భాగంగా ఈరోజు మరో రసవత్తర పోరు జరుగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. బుధవారం రాత్రి 7: 30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ఐపీఎల్ 2023లో చెన్నై, రాజస్థాన్ జట్లు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో చెరో రెండిటిలో విజయాలు అందుకున్నాయి. పాయింట్ల పట్టికలో ఆర్‌ఆర్ రెండో స్థానంలో ఉండగా.. సీఎస్‌కే ఐదో స్థానంలో ఉంది.
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో సంజూ సేన భారీ స్కోర్లు చేసింది. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, షిమ్రాన్ హెట్‌మైర్ బాగా ఆడుతుండగా.. బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చహల్, ఆర్ అశ్విన్ భీకర ఫామ్‌లో ఉన్నారు. చెన్నైతో వీరు రాణిస్తే రాజస్థాన్ జట్టుకు తిరుగుండదు. ఈ మ్యాచులో రాజస్థాన్ ఫేవరేట్ అని చెప్పొచ్చు.
చెన్నై రెండు మ్యాచ్‌ల్లో నామమాత్రపు స్కోర్లు చేసి.. లక్నోపై భారీ స్కోర్ చేసింది. అయితే సీఎస్‌కే బ్యాటింగ్ మొత్తం రుతురాజ్ గైక్వాడ్‌పైనే ఆధారపడి ఉంది. ఖరీదైన ప్లేయర్స్ దీపక్ చహర్, బెన్ స్టోక్స్ గాయాల బారిన పడటం ఆ జట్టుకు పెద్ద లోటు అని చెప్పవచ్చు. అనారోగ్యం కారణంగా గత మ్యాచ్ ఆడని మొయిన్ అలీ ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దేవాన్ కాన్వే, అంబటి రాయుడు, శివమ్ దూబే పర్వాలేదనిపిస్తున్నారు. బౌలింగ్‌లో ఆర్ జడేజా, మిచెల్ సాంట్నర్, తుషార్ దేశ్‌పాండే, హంగార్గేకర్ పర్వాలేదనిపిస్తున్నారు.
Also Read: MS Dhoni Record: అరుదైన రికార్డుకు చేరువలో ఎంఎస్ ధోనీ.. ఎవరికీ సాధ్యం కాలేదు! జడేజా ప్రత్యేక సందేశం
తుది జట్లు (అంచనా):
చెన్నై: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ఆర్ జడేజా, ఎంఎస్ ధోనీ, శివమ్ దూబే, మిచెల్ సాంట్నర్, మగాలా, తుషార్ దేశ్‌పాండే.
రాజస్థాన్: యశస్వి జైస్వాల్, జొస్ బట్లర్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్‌మైర్, దృవ్ జురెల్, ఆర్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చహల్.
డ్రీమ్ 11 టీమ్ (CSK vs RR Dream11):
వికెట్ కీపర్లు: జోస్ బట్లర్, సంజు శాంసన్
బ్యాటర్లు: అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ (కెప్టెన్)
ఆల్ రౌండర్లు: రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, మొయిన్ అలీ
బౌలర్లు: యుజ్వేంద్ర చహల్, ట్రెంట్ బౌల్ట్, మహేశ్ తీక్షణ
Also Read: Magal Gochar 2023: కుజ సంచారం 2023.. మే 10 నుంచి ఈ 4 రాశుల వారికి రాజయోగం! డబ్బేడబ్బు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
CSK Vs RR Dream11 Prediction: చెన్నై, రాజస్థాన్ ఢీ.. డ్రీమ్ 11 టీమ్ ఇదే! కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
చెన్నై, రాజస్థాన్ ఢీ
డ్రీమ్ 11 టీమ్ ఇదే
కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్