Bandi Sanjay Comments: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ సన్మానం.. శాలువా తీసుకువస్తే చివరికి..

Bandi Sanjay Satirical Comments On CM KCR: ప్రధాని మోదీ టూర్‌కు సీఎం కేసీఆర్ రాకపోవడంపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రధాని పర్యటనకంటే కేసీఆర్‌కు అంత ముఖ్యమైన పని ఏముందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ సభకు వస్తే సన్మానం చేద్దామని శాలువా తీసుకువచ్చానని అన్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 8, 2023, 05:12 PM IST
Bandi Sanjay Comments: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ సన్మానం.. శాలువా తీసుకువస్తే చివరికి..

Bandi Sanjay Satirical Comments On CM KCR: వేల కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి తెలంగాణకు వస్తే సీఎం కేసీఆర్ మొఖం చాటేయడం సిగ్గు చేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కేసీఆర్ అభివృద్ధి నిరోధకుడంటూ ధ్వజమెత్తారు. పరేడ్ గ్రౌండ్ వద్ద  మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తీరును తప్పుపట్టారు. ప్రధాని మోదీ సభా వేదికపై సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలకు చైర్‌లు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే బీజేపీతో వైరం కారణంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రధాని పర్యటనకు దూరంగా ఉన్నాయి.

సీఎం కేసీఆర్ గైర్హాజరుపై బండి సంజయ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా బిజీ అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం రూ.11 వేల 360 కోట్ల పనుల ప్రారంభానికి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వస్తే కూడా సీఎం హాజరు కాకపోవడం సిగ్గు చేటు. సీఎం కేసీఆర్ అంత ముఖ్యమైన ఏముందని అడిగారు. తెలంగాణలో వేల కోట్లతో జరిగే అభివృద్ధి పనులకు హాజరు కావాలని సీఎం రావాలని తాను స్వయంగా కోరినట్లు చెప్పారు. ఆయన కోసం ప్రత్యేకంగా సీటు కేటాయించామని.. సన్మానించేందుకు తాను శాలువా కూడా తెచ్చానంటూ సెటైర్లే వేశారు. కానీ ఎందుకు రాలేదు..? ప్రధాని వచ్చినా రాలేదంటే అంత పనేముంది..? అని ప్రశ్నించారు.   

'తక్షణమే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఈ కార్యక్రమానికి ప్రధాని, గవర్నర్, కేంద్ర మంత్రులు వచ్చినా.. కేసీఆర్ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలి. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఎన్నికలయ్యాక అభివృద్దే ముఖ్యమని ప్రధాని చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేకుండా తెలంగాణ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమానికి రాకుండా కేసీఆర్ అభివృద్ధి నిరోధకుడని మరోసారి నిరూపించారు. తెలంగాణ అభివృద్ధి పనులను వీక్షించేందుకు పరేడ్ గ్రౌండ్ పెద్ద ఎత్తున పజలొచ్చారు. టీవీల ద్వారా రాష్ట్ర ప్రజలంతా వీక్షించారు. సీఎం రాని విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. తగిన సమయంలో కేసీఆర్‌కు బుద్ది చెప్పడం ఖాయం..' అని బండి సంజయ్ అన్నారు. 

శనివారం ప్రధాని మోదీ హైదరాబాద్‌లో సుడిగాలి పర్యటన చేశారు. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఆయన విమర్శలు గుప్పించారు. 

Also Read: PM Modi Speech: సీఎం కేసీఆర్ టార్గెట్‌గా ప్రధాని మోదీ ప్రసంగం.. అవినీతిపరులపై చర్యలు ఖాయం  

Also Read: Vande Bharat Express: సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించిన మోదీ.. ప్రయాణ సమయం ఎంతంటే..?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News