Advance Tax Calculation: 2022-2023 ఆర్థిక సంవత్సరానికి అడ్వాన్స్ ట్యాక్స్ చివరి వాయిదా చెల్లింపు గడువు మార్చి 15వ తేదీతో ముగియనుంది. గడువు తేదీలోగా ముందస్తు పన్ను చివరి వాయిదా చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ ఇటీవల పన్ను చెల్లింపుదారులకు సూచించింది. ఈ నెల 15వ తేదీలోపు అడ్వాన్స్ ట్యాక్స్ చివరి వాయిదా చెల్లించాలని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ట్విట్టర్‌లో పేర్కొంది. 'పన్ను చెల్లింపుదారులకు అటెన్షన్. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు చివరి వాయిదా ముగింపు తేదీ వచ్చేసింది. 15 మార్చి 2023లోపు మీ అడ్వాన్స్ ట్యాక్స్ చివరి వాయిదాను చెల్లించాలని గుర్తుంచుకోండి..' అని ట్వీట్ చేసింది.
Attention Taxpayers!
The last date for payment of the last instalment of Advance Tax is almost here!Do remember to pay your fourth & final instalment of Advance Tax by 15th March, 2023. pic.twitter.com/nDvehTrpSV
— Income Tax India (@IncomeTaxIndia) March 10, 2023
ముందస్తు ట్యాక్స్ అంటే..?
అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఒకేసారి మొత్తం కాకుండా ఆర్థిక సంవత్సరం చివరిలో ఆదాయపు పన్ను శాఖ గడువు తేదీల ప్రకారం వాయిదాలలో చెల్లించాల్సిన ఆదాయపు పన్ను మొత్తం. మొదటి వాయిదా అంటే చెల్లించాల్సిన మొత్తంలో 15 శాతం జూన్ 15లోగా చెల్లించాలి. రెండో విడత లేదా 45 శాతం పన్ను మొత్తాన్ని సెప్టెంబర్ 15లోగా చెల్లించాలి. మూడో విడత అడ్వాన్స్ ట్యాక్స్ 75 శాతం డిసెంబర్ 15లోగా చెల్లించాలి. మిగిలిన మొత్తం లేదా 100 శాతం పన్నును మార్చి 15న లేదా అంతకు ముందు చెల్లించాల్సి ఉంటుంది.
ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెట్‌సైట్ ప్రకారం.. ఏడాదికి రూ.10 వేలు లేదా అంతకంటే ఎక్కువ ట్యాక్స్ చెల్లించే ప్రతి వ్యక్తి సెక్షన్ 208 ప్రకారం అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం 1961 నిబంధనల ప్రకారం ఆదాయపు పన్ను లెక్కిస్తారు. అయితే ఈ నియమం సీనియర్ సిటిజన్లకు వర్తించదు. వారు వ్యాపారం లేదా వృత్తి నుంచి ఆదాయం కలిగి ఉంటే తప్పా.. ఎటువంటి ముందస్తు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
ట్యాక్స్ పేయర్ తన ఆదాయపు పన్నును గడువు తేదీకి ముందు చెల్లించడంలో విఫలమైతే.. సెక్షన్ 234B, 243C కింద చెల్లించని పన్నుపై వడ్డీని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి అడ్వాన్స్ ట్యాక్స్‌ను చెల్లించడం మర్చిపోతే.. పేర్కొన్న గడువు తేదీల్లో లేదా అంతకు ముందు ఏదైనా వాయిదా చెల్లించడంలో విఫలమైతే లేదా డిఫాల్ట్ అయినట్లయితే.. మొదటి 3 త్రైమాసికాల్లో త్రైమాసికానికి 3 శాతం, చివరి త్రైమాసికానికి ఒక శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి ఏప్రిల్ నుంచి (ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత) అడ్వాన్స్ ట్యాక్స్ లోటుపై నెలకు ఒక శాతం చొప్పున అదనపు వడ్డీని చెల్లించాలి.
Also Read: TSPSC Paper Leak: పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలక మలుపు.. గ్రూప్ 1 పేపర్ కూడా లీక్..?
Also Read: Maruti Brezza: రూ.3 లక్షలకే ఈ కారు తీసుకెళ్లండి.. ఎగబడికొంటున్న జనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook