Delhi new ministers: కొత్త మంత్రులుగా ఇద్దరు ప్రమాణ స్వీకారం.. వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

Delhi New Ministers Details: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన మనీష్ సిసోడియా, మరో కేసులో జైల్లో ఉన్న ఉపేందర్ జైన్ మంత్రుల పదవులకు కూడా రాజీనామా చేసిన క్రమంలో ఇద్దరు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 9, 2023, 05:20 PM IST
Delhi new ministers: కొత్త మంత్రులుగా ఇద్దరు ప్రమాణ స్వీకారం.. వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

Delhi New Ministers News: అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్‌లో కొత్తగా ఇద్దరు మంత్రులు చేరారు. గురువారం ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు సౌరభ్ భరద్వాజ్, అతిషి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని ఎల్జీ హౌస్‌లో సౌరభ్ భరద్వాజ్, అతిషి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అతిషికి విద్య, పిడబ్ల్యుడి, విద్యుత్, పర్యాటక శాఖలు అప్పగించగా సౌరభ్ భరద్వాజ్‌కు ఆరోగ్యం, యూడీ, నీరు, పరిశ్రమల బాధ్యతలు అప్పగించారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఢిల్లీ ప్రభుత్వ మంత్రులు కూడా పాల్గొన్నారు.
 

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఇతర మంత్రుల పదవులకు కూడా రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయనతో పాటు సత్యేందర్ జైన్ కూడా ఆరోగ్య మంత్రి పదవికి రాజీనామా చేశారు. వీరిద్దరి రాజీనామాలను సీఎం కేజ్రీవాల్ ఆమోదించారు. ఆ తర్వాత వాటిని రాష్ట్రపతికి పంపగా, అక్కడ సిసోడియా, జైన్‌ల రాజీనామాలను ఆమోదించారు. దీంతో పాటు కొత్త మంత్రుల పదవికి ఆప్ ఎమ్మెల్యేలు సౌరభ్ భరద్వాజ్, అతిషి పేర్లను ఢిల్లీ ప్రభుత్వం పంపగా, వాటికి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే సౌరభ్ భరద్వాజ్, అతిషి గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

సౌరభ్ భరద్వాజ్ ఎవరు?
సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ గ్రేటర్ కైలాష్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే. సౌరభ్ భరద్వాజ్ వరుసగా మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2013లో తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సౌరభ్ భరద్వాజ్ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కూడా. అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ మంచి అనుభవం ఉన్న సౌరభ్ భరద్వాజ్ కు గ్రేటర్ కైలాష్ అసెంబ్లీలోనూ మంచి పట్టు ఉంది. ఇక మరోపక్క సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ జల్ బోర్డు వైస్ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు.

అతిషి కల్కాజీ ఎవరు?  
మరోవైపు, ఎమ్మెల్యే అతిషి 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో గెలిచారు. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకు ముందు 2019 లో, అతిషి కూడా బిజెపికి చెందిన గౌతమ్ గంభీర్‌పై తూర్పు ఢిల్లీ నుండి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేశారు, కానీ గెలవలేక పోయారు. ఇక ప్రభుత్వ విద్యా విధానాన్ని రూపొందించడంలో అతిషి సహకారం ఉందని అంటారు. 

Also Read: MLC Kavitha: ప్రెస్‌మీట్ లైవ్‌లోనే ఎమ్మెల్సీ కవితకు షాకిచ్చిన ఢిల్లీ పోలీసులు

Also Read: Military Cannon Firing: హోలీ వేడుకల్లో విషాదం.. ఫిరంగి గుండు పేలి ముగ్గురు మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News