Indusind Bank: ఇండస్ఇండ్ బ్యాంకు కొత్త ఛైర్మన్‌గా అదానీ కంపెనీ డైరెక్టర్ నియామకం

Indusind Bank: హిండెన్ బర్గ్ నివేదిక కారణంగా రోజురోజుకూ పతనమౌతున్న అదానీ గ్రూప్‌కు రుణాలిచ్చిన బ్యాంకుల్లో ఒకటి ఇండస్ఇండ్ బ్యాంక్. ఈ బ్యాంకు కొత్త ఛైర్మన్‌గా అదానీ గ్రూప్ డైరెక్టర్ నియమితులవడం ఆశ్చర్యం కల్గిస్తోంది. బ్యాంకు నిబంధనలు అడ్డొస్తాయనే కారణంతో పాత కంపెనీకు రాజీనామా చేశారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 27, 2023, 08:51 PM IST
Indusind Bank: ఇండస్ఇండ్ బ్యాంకు కొత్త ఛైర్మన్‌గా అదానీ కంపెనీ డైరెక్టర్ నియామకం

హిండెన్‌బర్గ్ నివేదికతో రోజురోజుకూ పతనమౌతున్నా అదానీ సామ్రాజ్య ప్రభావం ఇంకా కొనసాగుతున్నట్టే కన్పిస్తోంది. ఏ బ్యాంకు రుణాలిచ్చిందో అదే బ్యాంకుకు చైర్మన్‌గా అదానీ గ్రూప్ కంపెనీ డైరెక్టర్ నియమితులవడం ఆశ్చర్యపరుస్తోంది. 

సునీల్ మెహతా రాజీనామా, కొత్త ఉద్యోగ బాధ్యతల్ని వెల్లడించింది, ధృవీకరించింది ఇండస్‌ఇండ్ బ్యాంక్ కాదు. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ. ఆ కంపెనీ డైరెక్టర్ పదవికి సునీల్ మెహతా రాజీనామా చేశారని తెలిపింది. కారణం కూడా వెల్లడించింది. ఇండస్‌ఇండ్ బ్యాంకు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న సునీల్ మెహతాకు ఏవిధమైన ఇబ్బందులు రాకూడదని రాజీనామా చేసినట్టు అదానీ కంపెనీ చెప్పడం విశేషం.

ఇండస్‌ఇండ్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా సునీల్ మెహతా  నియామకానికి ఆర్బీఐ ఆమోదం లభించింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ అదానీ కంపెనీకు ఇస్తున్న రుణాలు, అనివార్య పరిణామాల్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలో ఉన్న డైరెక్టర్ పదవిని వదులుకోవాలని బ్యాంకు సూచించింది. అందుకే అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ పదవికి సునీల్ మెహతా రాజీనామా చేశారు. 

అదానీ కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయడానికి మరే ఇతర కారణం లేదని సునీల్ మెహతా వెల్లడించారు. మెహతా రాజీనామా ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి వచ్చింది. ఇండస్ ఇండ్ బ్యాంకుతో కంపెనీకు ఉన్న సంబంధాలు, ఇతరత్రా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 

సునీల్ మెహతా ఇండస్‌ఇండ్ బ్యాంకు ఛైర్మన్‌గా మూడేళ్ల వరకూ అంటే 2026 జనవరి 30 వరకూ కొనసాగేలా బ్యాంకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రత్యేక రిజల్యూషన్‌పై పోస్టల్ బ్యాలెట్ నిర్వహించేందుకు నిర్ణయించింది. రుణాలు తీసుకున్న కంపెనీ డైరెక్టర్ సునీల్ మెహతాపై బ్యాంకుకు అంత ప్రేమ ఏంటనేది అర్ధం కాని ప్రశ్న. గతంలో ఈయన ఎస్ బ్యాంకు ఛైర్మన్‌గా పనిచేశారు. అంతేకాదు..పంజాబ్ నేషనల్ బ్యాంకుకు నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా 2017 నుంచి 2020 వరకూ వ్యవహరించారు. 

Also read: Adani-Hindenburg Issue: ఆగని పతనం, ప్రపంచ కుబేరుల జాబితాలో 30వ స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News