BRS MLA Pilot Rohit Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకోవడంపై టిపీసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్పందిస్తూ.. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరు దొంగలు పడిన తరువాత ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఉంది అని అన్నారు. పార్టీ మార్పు విషయంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నేతలు అప్పట్లోనే మాపై కోర్టులు కేసులు వేశారు అని గుర్తు చేశారు.
కాంగ్రెస్ నేతలు ముందుగా వాళ్ళ అంతర్గత తగాదాలు తేల్చుకుని, ఆ తరువాత బయటి విషయాలు మాట్లాడితే బాగుంటుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హితవు పలికారు. టిఫిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఫిర్యాదు బీజేపీకి వత్తాసు పలికినట్లుగానే ఉందని చెబుతూ.. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు బ్రాండ్ అంబాసిడర్ అని.. రేవంత్ రెడ్డి గుణం తెలుసుకున్నారు కనుకే కేసీఆర్ ఆనాడే టీఆర్ఎస్ పార్టీ నుంచి జడ్పీటీసీ టికెట్ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భం గురించి వివరిస్తూ రాజ్యాంగం ప్రకారమే, షెడ్యూల్డ్ 10 ప్రకారమే టీఆరెస్ పార్టీలో విలీనం చేశామని తెలిపారు. నియోజకవర్గ ప్రజల అభీష్టంమేరకు, ప్రాంత అభివృద్ధి కోసమే పార్టీ మారాం కానీ తమపై ఎవరి ఒత్తిళ్లు కానీ లేదా ప్రలోభాలు కానీ లేవని గుర్తుచేశారు.
రేవంత్ రెడ్డి పార్టీ మారడం గురించి పైలట్ రోహిత్ రెడ్డి స్పందిస్తూ.. ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడే రాజీనామా లేఖను స్పీకర్‌కు ఇవ్వకుండా చంద్రబాబుకు ఇచ్చారని.. ఆయన వైఖరి ఏంటో దాన్నేబట్టే అర్థం చేసుకోవచ్చని అన్నారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైందని.. ఇక రేవంత్ రెడ్డి చేయడానికి ఏమీ లేదని పైలట్ రోహిత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి : Revanth Reddy's Open Letter: కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి ఓపెన్ లెటర్.. విషయం ఏంటంటే..
ఇది కూడా చదవండి : MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత కేసు కంచి చేరిందా..! బీజేపీ-బీఆర్ఎస్ మధ్య డీల్..?
ఇది కూడా చదవండి : Kishan Reddy Comments: తెలంగాణ వాళ్ల కోసం కాదు, వేరే వాళ్ల కోసం దర్యాప్తు చేస్తుంటే వీళ్ల పేర్లు బయటకొచ్చాయి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook