Kidney Health: మీకు ఈ అలవాట్లు ఉంటే వెంటనే వదిలేయండి, లేకపోతే మీ కిడ్నీలకు దెబ్బే..!

Kidney Problem: దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో కిడ్నీ రోగులు ఎక్కువై పోయారు. దీనికి కారణం మన జీవన శైలిలో మార్పులు, అలవాట్లే కారణమంటున్నారు వైద్యులు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2023, 12:15 PM IST
Kidney Health: మీకు ఈ అలవాట్లు ఉంటే వెంటనే వదిలేయండి, లేకపోతే మీ కిడ్నీలకు దెబ్బే..!

Worst Habits For Kidney Health: మన శరీరంలో కిడ్నీ చాలా ముఖ్యమైన అవయవం. బాడీలో మురికిని శుభ్రపరిచే పనిని కిడ్నీలు చేస్తాయి. అందుకే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మన యెుక్క కొన్ని చెడు అలవాట్లు మూత్రపిండాలను దెబ్బతిసే అవకాశం ఉంది. ఈ హ్యాబిట్స్ ఎంత వీలైతే అంత తొందరగా వదిలేయండి, లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే వెంటనే ఈ కింది అలవాట్లు మానుకోవాలని వైద్య నిపుణలు సూచిస్తున్నారు. 

ఈ అలవాట్లను వెంటనే మానేయండి..
తక్కువ నీరు తాగడం
కిడ్నీలు హెల్తీగా ఉండటానికి నీరు బాగా తాగాలి. చాలా మంది దాహం వేసినప్పుడు మాత్రమే వాటర్ తీసుకుంటారు. మనం తగినంత మెుత్తంలో నీరు తీసుకోకపోతే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా అనేక రకాల సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే అధిక మెుత్తంలో నీరు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 
మద్యపానం మానేయండి
ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరమనే విషయం మనందరికీ తెలిసిందే. అయినా సరే చాలా మంది మద్యంను తీసుకుంటారు. అతిగా మద్యం సేవించడం వల్ల కిడ్నీలు పూర్తిగా పాడవుతాయి. అందుకే వీలైనంత వరకు ఈ అలవాటును వదిలించుకోండి. 

ఉప్పు ఎక్కువగా తీసుకోవద్దు
ఉప్పులో సోడియం చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది మీ రక్తపోటును పెంచుతుంది. అంతేకాకుండా కిడ్నీ వ్యాధులకు కారణమవుతుంది. రోజూకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోవద్దని వైద్యులు తెలుపుతున్నారు.
ధూమపానానికి దూరంగా ఉండండి
మూత్రపిండాలు బాగా పనిచేయాలంటే ధూమపానానికి దూరంగా ఉండండి. స్మోకింగ్ రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల రక్తప్రసరణ మందగించి కిడ్నీలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడొద్దు
మనం ఏదైనా నొప్పి వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాం. వీటిని అతిగా వాడటం వల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే దీని వల్ల కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. 

Also Read: Walnuts For Diabetes: వాల్‌నట్స్‌ను శీతాకాలంలో ప్రతి రోజూ తీసుకుంటే మధుమేహం 12 రోజుల్లో దిగి రావడం ఖాయం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Trending News