ఆధునిక జీవనశైలి కారణంగా కిడ్నీలో రాళ్ల సమస్య సాధారణమైపోయింది. ప్రారంభంలోనే జాగ్రత్త వహించకపోతే తీవ్రమైపోతుంది. అందుకే కిడ్నీలో సమస్య ఎదురైతే వెంటనే అప్రమత్తం కావాలి.
శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అంగాలు. ఇవి రక్తాన్ని శుభ్రం చేస్తుంటాయి. మనం తినే ఆహార పదార్ధాల్లోని విష పదార్ధాల్ని తొలగించే పని కిడ్నీలు చేస్తుంటాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడటం లేదా ఏదైనా సమస్య తలెత్తితే రక్తాన్ని శుభ్రం చేసే పనిలో ఆటంకం ఏర్పడి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. కిడ్నీలో రాళ్లుంటే ఏ విధమైన లక్షణాలు కన్పిస్తాయనేది చూద్దాం.
డయాబెటిస్ లేదా స్థూలకాయం సమస్యతో బాధపడేవారికి కిడ్నీలో రాళ్లుంటే ప్రమాదకరం. నీళ్లు తక్కువగా తాగినా లేదా అడ్డమైన తిను బండారాలు అంటే జంక్ ఫుడ్స్ వంటివి తీసుకున్నా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.
కిడ్నీలో రాళ్లుంటే వీపు, కడుపులో విపరీతమైన నొప్పి ఉంటుంది. కిడ్నీలో రాళ్లున్నప్పుడు నొప్పి భరించలేనిదిగా ఉంటుంది. ఈ రాళ్లు మూత్రం వెళ్లే మార్గంలో అడ్డుపడితే మూత్రానికి ఇబ్బంది ఏర్పడుతుంది. కిడ్నీలో రాళ్లుంటే నొప్పి హఠాత్తుగానే ప్రారంభమౌతుంది.
కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే మూత్రంలో రక్తం రావడం ఓ లక్షణం. ఈ రక్తం ఎర్రగా, పింక్ కలర్‌లో లేదా గోధుమ రంగులో ఉంటుంది. ఈ లక్షణాలున్నప్పుడు పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు.
మూత్రం శుభ్రంగా ఉంటే ఏ విధమైన దుర్వాసన ఉండదు. అంటే మీరు లేదా మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నట్టు అర్ధం. అదే మూత్రంలో దుర్వాసన వస్తుంటే మాత్రం కిడ్నీలో రాళ్లకు సంకేతం కావచ్చు.
Also read: BF.7 Variant Cases in India: వామ్మో.. చైనాను హడలెత్తిస్తున్న వేరియంట్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook