Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రా రెడ్డి, బినోయ్ బాబులకు కోర్టులో ఈడి చేతిలో చుక్కెదురైంది. శరత్ చంద్రా రెడ్డి, బినోయ్ బాబుల ఈడీ కస్టడీని మరో నాలుగు రోజుల పాటు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఇద్దరు నిందితులను తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఈడి కోరింది. ఈడి కస్టడీ పొడిగింపుపై అభ్యంతరం వ్యక్తం చేసిన శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు తరపు న్యాయవాదులు.. బినోయ్ బాబు విచారణలో వెల్లడైన విషయాల ఆధారంగా కొన్ని సోదాలు నిర్వహించాం. ఈ సోదాల్లో నిందితులకు వ్యతిరేకంగా డిజిటల్ రూపంలో కొన్ని ఆధారాలు సేకరించామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోర్టుకి తెలిపారు.
సేకరించిన ఆధారాల ద్వారా తదుపరి విచారణ కోసం శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు కస్టడీ పొడిగించాలని ఈడి అధికారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈడి దర్యాప్తుకి శరత్ చంద్రా రెడ్డి సహకరించడం లేదని ఈడి అధికారులు కోర్టుకి ఫిర్యాదు చేశారు. ఇదే కేసులో అరుణ్ పిళ్ళై, రాజ్ కుమార్‌ని ప్రశ్నించబోతున్నామని, వారిని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఈడి అధికారులు కోర్టుకు తెలిపారు.
ఇదిలావుంటే, శరత్ చంద్రారెడ్డి తరపు న్యాయవాది సైతం ఈడి అధికారులపై కోర్టుకు ఫిర్యాదు చేశారు. పీఎంఎల్ఏ సెక్షన్ 50 ప్రకారం ఇప్పటికే శరత్ చంద్రా రెడ్డి స్టేట్‌మెంట్ రికార్డు చేశారని.. అయినప్పటికీ దర్యాప్తు పేరుతో రాజకీయ కక్ష సాధింపు జరుగుతోందని శరత్ చంద్రారెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. మరోవైపు బినోయ్ బాబు తరపు న్యాయవాది సైతం తన క్లయింట్ బినోయ్ బాబుకు అనుకూలంగా కోర్టు ఎదుట తన వాదనలు వినిపించారు. బినోయ్ బాబు మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడని, ఇప్పటికే 12 సార్లు స్టేట్‌మెంట్ రికార్డు చేసినందున ఇకనైనా కస్టడీ నుంచి మినహాయింపు ఇవ్వాలని బినోయ్ బాబు తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
అయితే, అటు ఈడి అధికారుల వాదనలు, ఇటు శరత్ చంద్రా రెడ్డి, బినోయ్ బాబు తరపు న్యాయవాదనలు విన్న కోర్టు.. ఈడి దగ్గర ఆధారాలు ఉన్నందున శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుల కస్టడీ పొడిగించడానికి మొగ్గు చూపుతూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం.కె నాగ్ పాల్ ఆదేశాలు జారీచేశారు. రేపు అరుణ్ పిళ్ళై, బుచ్చిబాబును ప్రశ్నించబోతున్నామని, అలాగే సోమవారం నాడు రాజ్ కుమార్ విచారణకు హాజరుకానున్నారని ఈడి అధికారులు కోర్టుకి తెలిపారు.
ఇక ఇప్పటికే ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సమీర్ మహేంద్రు జ్యుడీషియల్ కస్టడీని నవంబర్ 26 వరకు పొడిగిస్తున్నట్టు కోర్టు స్పష్టంచేసింది. తీహార్ జైలులో రెండు రోజుల పాటు సమీర్ మహేంద్రును ఈడి అధికారులు ప్రశ్నించేందుకు అనుమతించిన రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు.. తదుపరి విచారణను సోమవారం మద్యాహ్నం 2 గంటలకి వాయిదా వేసింది. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో ( Delhi Liquor Scam Case ) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు వేగం పెంచారని ఈ వరుస పరిణామాలు చూస్తోంటే అర్థమవుతోంది.
Also Read : Delhi Liquor Scam: బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచే ఢిల్లీ లిక్కర్ స్కామ్ క్యాష్ డీలింగ్స్ ?
Also Read : Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో విజయసాయి రెడ్డి అల్లుడు అరెస్ట్.. నెక్స్ట్ కేసీఆర్ ఫ్యామిలీయేనా?
Also Read : Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మెయిన్ వికెట్ అవుట్.. తెలంగాణలో కలకలం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook