Cought At Night Time: రాత్రి సమయంలో దగ్గు ఎక్కువగా ఉంటే..నిర్లక్ష్యం చేయొద్దు

Cought At Night Time: చాలామందికి రాత్రివేళ దగ్గు తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుంటుంది. ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రివేళల్లో దగ్గు ఎక్కువగా ఉండటానికి కారణాలేంటో చూద్దాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 9, 2022, 05:32 PM IST
Cought At Night Time: రాత్రి సమయంలో దగ్గు ఎక్కువగా ఉంటే..నిర్లక్ష్యం చేయొద్దు

శరీరంలో జరిగే వివిధ రకాల మార్పులు వివిధ రూపాల్లో బయటకు కన్పిస్తుంటాయి. దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటివే. రాత్రివేళ దగ్గు అధికంగా ఉంటే పెద్ద కారణమే కావచ్చని అంచనా. 

రాత్రి సమయంలో అదే పనిగా దగ్గు బాధపెడుతోందా..ఈ సమస్యకు జలుబు, ఫ్లూ కారణం కావచ్చు. అయితే శరీరంలో కఫం పేరుకుపోతుంటే..ఈ సమస్య మరింత పెరుగుతుంది. రాత్రి పడుకునేటప్పుడు కఫం గొంతులోకి చేరి..దగ్గు ఎక్కువౌతుంటుంది. రాత్రి సమయంలో దగ్గుకు ఇంకా చాలా కారణాలున్నాయి. ఇందులో ఆస్తమా, ఎలర్జీ, జలుబు ఉన్నాయి. దగ్గుకు కచ్చితమైన కారణాలేంటనేది వివరంగా తెలుసుకుందాం..

రాత్రి సమయంలో దగ్గుకు కారణాలు

వైరల్ ఇన్‌ఫెక్షన్

జలుబు, ఫ్లూ కారణంగా రాత్రి సమయంలో దగ్గు సమస్య వెంటాడుతుంటుంది. దాదాపు ఓ వారం రోజులుంటుంది. ఇది మీపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

ఆస్తమా

ఆస్తమా రోగులు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఆస్తమా సమస్యతో బాధపడే వ్యక్తికి రాత్రి వేళ దగ్గు ఎక్కువగా ఉంటుంది. ఆస్తమా కారణంగా ఆ వ్యక్తికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఫలితంగా ఛాతీలో పట్టేసినట్టుండి..ఆందోళన కలుగుతుంది.

పోస్ట్ నాసల్‌డ్రిప్

కఫం ముక్కు నుంచి దిగువకు గొంతు వరకూ చేరుకుంటే పోస్ట్ లాసల్ డ్రిప్ సమస్య ఏర్పడుతుంది. రాత్రి పడుకునేటప్పుడు ఈ సమస్య మరింత పెరుగుతుంది. పోస్ట్ నాసల్ డ్రిప్ సమస్య కారణంగా రాత్రి వేళ దగ్గు తీవ్రమౌతుంది. ఈ సమస్య ఉన్నప్పుడు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. 

గెర్డ్

గ్యాస్ట్రోఓసోఫీగల్ ఓ రకమైన క్రానిక్ యాసిడ్ రిఫ్లక్స్. ఈ సమస్య ఉన్నప్పుడు రాత్రి వేళ దగ్గు చాలా అధికంగా ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పుడు కడుపులో మంట, పుల్లటి తేన్పులు వస్తుంటాయి.

Also read: Honey Precautions: తేనెను ఈ పదార్ధాలతో కలిపి సేవిస్తే..మొత్తం విషమైపోతుంది జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News