/telugu/photo-gallery/how-to-make-easy-and-delicious-bakery-style-plum-cake-here-pr-ocess-of-making-rv-187168 Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా 187168

Chandra Grahanam in November 2022:  ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహణాలు.. ప్రపంచం, దేశం, ప్రజలు మరియు రాశిచక్రాలపై ప్రభావాన్ని చూపుతాయి. మరో నాలుగు రోజుల్లో అంటే నవంబరు 08న చంద్రగ్రహణం (Chandra Grahan 2022) ఏర్పడుతుంది. ఈ గ్రహణం కార్తీక శుక్ల పూర్ణిమ నాడు ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇదే రోజు దేవ్ దీపావళి కూడా వస్తుంది. ఇప్పుడు ఏర్పడబోయేది సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది భారతదేశమంతటా కనిపిస్తుంది. 

ఏయే దేశాల్లో కనిపిస్తుంది: ఈ చంద్రగ్రహణం భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఈశాన్య యూరప్, పసిఫిక్ మహాసముద్రం మరియు ఆసియా మరియు రష్యా, చైనా, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, కజకిస్తాన్, మంగోలియా సహా అనేక  దేశాలలో కనిపించనుంది. ఈ గ్రహణం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. చంద్ర గ్రహణం ప్రభావం మరియు గ్రహణం సమయం గురించి తెలుసుకుందాం.

చంద్రగ్రహణం సమయం: చంద్రగ్రహణం మధ్యాహ్నం 2:39 గంటలకు ప్రారంభమై... సాయంత్రం 6.19 గంటలకు ముగుస్తుంది. సూర్యుడు మరియు చంద్రుని మధ్య భూమి వచ్చినప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. సూతక కాలానికి 9 గంటల ముందు ఈ గ్రహణం ప్రారంభమవుతుంది. సూతక కాలం మెుదలైన తర్వాత ఆహారం తినకూడదు. 

12 రాశులపై గ్రహణ ప్రభావం:  ఈ గ్రహణం భరణి నక్షత్రం మరియు మేషరాశిలో జరుగుతోంది. అందువల్ల ఈ నక్షత్రం మరియు రాశిచక్రంలో జన్మించిన వ్యక్తులకు ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వీరు దానధర్మాలు, జపం, పారాయణాలు చేయాలి. 
1. మేషం :- ప్రమాద భయం
2. వృషభం :- ధన నష్టం
3. మిథునం :- పురోగతి మరియు లాభం
4. కర్కాటకం :- ఆనందం మరియు తేజస్సు
5. సింహం :- పరువు నష్టం, భయం
6. కన్యారాశి :- శరీరానికి సంబంధించిన ఇబ్బందులు
7. తుల :- వైవాహిక ఇబ్బందులు
8. వృశ్చికం :- పనిలో విజయం
9. ధనుస్సు :- ఆందోళన మరియు నొప్పి
10. మకరం :- రోగ భయం
11. కుంభం :- ధనలాభం
12. మీనం :- ఖర్చులు పెరుగుతాయి

గ్రహణ ఇతర ఫలితాలు: కార్తీక మాసంలో మంగళవారం చంద్రగ్రహణం కారణంగా దోపిడీ, దొంగతనం, అగ్నిప్రమాదాలు అధికమవుతాయి. అలాగే, శీతాకాలపు పంటలలో వ్యాధుల వ్యాప్తి ఉంటుంది. రాజకీయ నాయకుల్లో కూడా టెన్షన్స్ పెరిగే అవకాశం ఉంది. గ్రహణ సమయంలో సంసప్తక యోగం ఏర్పడుతోంది. 

Also Read: Kartik Purnima 2022: కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే అంతే సంగతి.. ఎందుకో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Section: 
English Title: 
Lunar Eclipse on 08th November 2022: Chandra Grahan time in India, Know Effect on All Zodiac Signs
News Source: 
Home Title: 

Chandra Grahan 2022: దేవ్ దీపావళి నాడు చంద్రగ్రహణం... 12 రాశులపై గ్రహణ ప్రభావం..

Chandra Grahan 2022:  దేవ్ దీపావళి నాడు చంద్రగ్రహణం... 12 రాశులపై గ్రహణ ప్రభావం..
Caption: 
Representational Image
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Chandra Grahan 2022: దేవ్ దీపావళి నాడు చంద్రగ్రహణం... 12 రాశులపై గ్రహణ ప్రభావం..
Samala Srinivas
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Saturday, November 5, 2022 - 18:14
Request Count: 
188
Is Breaking News: 
No