Horse Gram for Weight Loss In 15 Days: చిరు ధాన్యాలు శరీరానికి చాలా మంచివి. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అయితే చాలా మందికి ఉలవల గురించి తెలియదు. అయితే ఇందులో శరీరానికి కావాల్సిన మూలకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే సులభంగా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఉలవల్లో ప్రొటీన్లు, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంగా వినియోగిస్తే అన్ని రకాల అనారోగ్య సమస్యలు సులభంగా చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఈ సమస్యలన్నిటికి చెక్:
బరువు తగ్గడం:
ఉలవ పప్పు తినడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పప్పులో ఉండే పోషకాలు ఆకలిని నియంత్రించడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు క్రమం తప్పకుండా ఈ పప్పను ఆహారంగా తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ పప్పులో కేలరీలు తక్కువగానూ, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని ఆహారంలో తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సులభంగా తగ్గతుంది.
కిడ్నీలో రాళ్లు:
ఉలవ పప్పు కిడ్నీలో రాళ్లు నివారించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఈ పప్పును తీసుకుంటే సులభంగా కిడ్నీలో రాళ్లు సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీరంలో హానికరమైన పదార్థాలును తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
గుండె సమస్యలకు చెక్:
ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇదే క్రమంలో గుండె పోటు వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఉలవ పప్పును ఆహారంలో వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచి అనారోగ్య సమస్యలను నుంచి సులభంగా దూరం చేస్తుంది.
చక్కెరను అదుపు ఉంటుంది:
ఉలవ పప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది. కాబట్టి తీవ్ర మధుమేహం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ పప్పును ఆహారంగా వినియోగించాల్సి ఉంటుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి