న్యూఢిల్లీ: నెహ్రూ వర్ధంతి సందర్భంగా శాంతివనంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 54వ వర్ధంతి సందర్భంగా.. ప్రధాని మోదీ ట్విట్టర్ లో జవహర్ లాల్ నెహ్రూకు నివాళులు అర్పించారు. 'దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా..ఆయనకు నివాళి' అంటూ ట్వీట్ చేశారు.
Tributes to our first Prime Minister, Pandit Jawaharlal Nehru on his death anniversary.
— Narendra Modi (@narendramodi) May 27, 2018
ఢిల్లీలోని శాంతివనంలో నెహ్రూ ఘాట్ వద్ద కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు నెహ్రూ సమాధి వద్ద నివాళులు అర్పించారు. దేశ తొలి ప్రధానిగా నెహ్రూ సేవలను ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గుర్తు చేసుకున్నారు.
Delhi: Former PM Dr.Manmohan Singh and Congress President Rahul Gandhi pay tribute to #JawaharLalNehru on his death anniversary pic.twitter.com/b4lJGum6EY
— ANI (@ANI) May 27, 2018
భారతదేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మే 27, 1964న మరణించారు. నెహ్రూ 1947 ఆగస్టు 15న ప్రధానమంత్రి అయ్యారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు.