Kidney Stones: మనిషి ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషించేది కిడ్నీలు. ఎందుకంటే రక్తాన్నిశుభ్రపర్చడం గానీ లేదా తినే ఆహార పదార్ధాల్లో వ్యర్ధాల్ని, విష పదార్ధాల్ని తొలగించడంలో కిడ్నీల పాత్ర చాలా కీలకం. అందుకే కిడ్నీల్ని ఎప్పటికప్పుుడు ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవాలి.
కిడ్నీ సమస్యనగానే ప్రధానంగా గుర్తొచ్చేది కిడ్నీలో రాళ్ల సమస్య. ఇది తాజాగా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. దీనికి చికిత్స ఉంటుంది. కానీ, చికిత్స కంటే నివారణ ఎప్పుడూ మంచిది. అసలు రాకుండా చూసుకోవడం చాలా ఉత్తమం. కిడ్నీలో రాళ్లు పడిన తర్వాత అసలు మన నిత్యజీవితంలో చిన్న మార్పులతో కిడ్నీలో రాళ్లు పడకుండా చూసుకోవచ్చు.
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే ముఖ్యంగా కాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. పాలు, పెరుగు, ఆకు కూరలు వంటివి రోజువారీ డైట్ లో భాగంగా చేసుకోవాలి. లేదా కనీసం వారానికి 4 రోజులైనా ఉండాలి. ఇక తినే ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవాలి. అలాగని పూర్తిగా మానకూడదు. కూరల్లో ఉప్పు వేస్తే పెరుగులో ఉప్పు మానడం ఇలా వీలైన చోట ఉప్పు తగ్గించేయాలి.
జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. వాటిలో లెమన్ సాల్ట్, ఇతరత్రా వినియోగం వల్ల చాలా ప్రమాదం. కాబట్టి, జంక్ ఫుడ్‌ను వదిలేయాలి. శరీరంలో మెగ్నీషియం పెంచుకోవాలి. క్యాల్షియం ఆక్సోలేట్ అనేది కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది.
మాంసం, పోర్క్, చికెన్, మటన్, చేపలు, గుడ్లు ఎక్కువగా తినడం వల్ల యూరిక్ యాసిడ్ ఎక్కువకుతుంది. దీన్ని కంట్రోల్లో ఉంచాలి. కాబట్టి వీటిని కూడా పరిమితంగానే తీసుకోండి. ఫాస్పేట్ ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.
రోజుకు కనీసం 12 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి. జ్యూసులు కూడా రెగ్యులర్‌గా తాగుతూ ఉండాలి. పంచదార సాధ్యమైనంతవరకూ మానేయడం మంచిది. పంచదార స్థానంలో తప్పని పరిస్థితుల్లో బెల్లం వాడితే మంచిది.
Also read: Hair Blacken tips: సహజసిద్ధంగా జుట్టు నల్లబడేందుకు ఇలా చేయండి, ఆ చిట్కాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook