/telugu/photo-gallery/how-to-make-easy-and-delicious-bakery-style-plum-cake-here-pr-ocess-of-making-rv-187168 Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా 187168

Dada Saheb Phalke Award 2022 to Asha Parekh : Love Life And Unknown Facts About Asha Parekh: ప్రముఖ నటి ఆషా పరేఖ్ ను 2020కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం నాడు తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 2020కి గాను ఆషా పరేఖ్ ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ సంధర్భంగా వెల్లడించారు.

భారతీయ సినిమా రంగంలో దాదాసాహెబ్ ఫాల్కే అత్యున్నత గౌరవం. సెప్టెంబర్ 30న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజ్ఞాన్ భవన్‌లో 79 ఏళ్ల ఆషా పరేఖ్ కి ఈ అవార్డును అందజేయనున్నారు. ఆశా పరేఖ్ 60 -70 లలో బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్గా ఉండేవారు. "దిల్ దేకే దేఖో", "కటి పతంగ్", "తీస్రీ మంజిల్", "కారవాన్" వంటి సినిమాలతో ఆమె స్టార్ స్టేటస్ సంపాదించారు. పరేఖ్ 1990ల చివరలో 'కోరా కాగజ్' అనే టీవీ సీరియల్ కు సైతం దర్శక నిర్మాతగా వ్యవహరించారు. 

హిందీతో పాటు పంజాబీ, గుజరాతీ, కన్నడ సినిమాలు కూడా చేసిన ఆమె తన సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించి, పలు టీవీ సీరియల్స్ ను నిర్మించింది. ఆశా ఇప్పటివరకు 95కి పైగా చిత్రాల్లో నటించారు. 1998 నుంచి 2001 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కి చైర్‌పర్సన్‌గా కూడా పని చేశారు. ఆ పదవిలో నియమితులైన మొదటి మహిళ ఆశా .  1992లో ఆమెకు పద్మశ్రీ పురస్కారం లభించింది.

నిజానికి ఆశా పరేఖ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అయితే మొదట్లో పెద్దగా సక్సెస్ కాలేదు, అయినా సరే ఆమె పట్టు వదలకుండా తన ప్రతిభతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఒకరకంగా ఆమె స్టార్ హీరోయిన్ అని పేరు తెచ్చుకోవడానికి ఇదే కారణం. నిజానికి తెరపై తన అందాలతో కోట్లాది మంది హృదయాలను దోచుకున్న ఆశా పరేఖ్ నిజజీవితంలో ఒంటరి. ఎందుకంటే ఆశా వివాహం చేసుకోలేదు.

ఆమె లవ్ ఫెయిల్యూర్ కారణంగానే వివాహం చేసుకోలేదని అంటూ అంటారు. అప్పట్లో జరిగిన ప్రచారం మేరకు ఆశా పరేఖ్ ఆ రోజుల్లో ప్రముఖ దర్శకుడు నాసిర్ హుస్సేన్‌తో రిలేషన్ ఉన్నారు. కానీ నాసిర్‌కు అప్పటికే పెళ్లయింది, అందుకే వారి సంబంధం తరువాతి దశకు వెళ్లలేక పోయింది. ఆశా నాసిర్ హుస్సేన్‌తో ఎంతగా ప్రేమలో ఉందంటే ఆమె ఆయనని తప్ప మరొకరిని తన జీవితంలో ఊహించుకోలేక జీవితాంతం ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇక గతేడాది రజనీకాంత్‌కు 2019 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది.

Also Read: Tragedy at Anirudh's Home: అనిరుధ్ ఇంట తీవ్ర విషాదం.. ఏమైందంటే?
Also Read: Sanjay Dutt in Prabhas Film: ప్రభాస్ సినిమాలో సంజయ్ దత్.. మాములుగా ప్లానింగ్ కాదుగా ఇది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Section: 
English Title: 
Dada Saheb Phalke Award 2022 to Asha Parekh
News Source: 
Home Title: 

ఆశా పరేఖ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.. ఆయనతో ప్రేమ వల్ల జీవితాంతం అవివాహితగానే!

Dada Saheb Phalke: ఆశా పరేఖ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.. ఆయనతో ప్రేమ వల్ల జీవితాంతం అవివాహితగానే!
Caption: 
Dada Saheb Phalke Award 2022 to Asha Parekh Source: Twitter
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఆశా పరేఖ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.. ఆయనతో ప్రేమ వల్ల జీవితాంతం అవివాహితగానే!
Chaganti Bhargav
Publish Later: 
No
Publish At: 
Tuesday, September 27, 2022 - 15:42
Request Count: 
93
Is Breaking News: 
No