Monkeypox: దేశంలో మంకీపాక్స్‌ టెర్రర్..కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఇవే..!

Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ డే౦జర్ బెల్స్ మోగిస్తోంది. క్రమేపి కేసులు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.

Written by - Alla Swamy | Last Updated : Aug 3, 2022, 12:57 PM IST
  • దేశంలో మంకీపాక్స్ కలవరం
  • పెరుగుతున్న కేసులు
  • మార్గదర్శకాలు జారీ
Monkeypox: దేశంలో మంకీపాక్స్‌ టెర్రర్..కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఇవే..!

Monkeypox: దేశంలో ఓవైపు కరోనా, మరోవైపు మంకీపాక్స్‌ కలవర పెడుతున్నాయి. ఇటీవల మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 8 కేసులు నమోదు అయ్యాయి. ఒకరు మృత్యువాత పడ్డారు. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీపాక్స్‌ను కట్టడి చేసేందుకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని కచ్చితంగా పాటించాలని సూచించింది.

మంకీ పాక్స్ బాధితులను ముట్టుకున్నా..వారికి సమీపంలో ఉన్న ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని తెలిపింది. మంకీపాక్స్‌ నుంచి మనల్ని మనము రక్షించుకోవాలని..వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ఏం చేయాలి..ఏం చేయకూడదో తెలుసుకుందామంటూ కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్విట్ చేసింది. ఇందులో కీలక సూచనలు పేర్కొంది.

మంకీపాక్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

- మంకీపాక్స్ బాధితులను దూరంగా ఐసోలేషన్‌లో ఉంచండి. శరీరంపై దద్దుర్లు పూర్తిగా తగ్గేంత వరకు వారిని ఐసోలేషన్‌లోనే ఉంచాలి.

- మంకీపాక్స్ బాధితులు మూడు లేయర్ల మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలి. దద్దుర్లు బయటి గాలికి తగలకుండా చర్యలు తీసుకోవాలి.

- బాధితులకు వద్దకు వెళ్లే సమయంలో ముఖానికి తప్పనిసరిగా మాస్క్‌లు, చేతులకు గ్లౌజులు ఉండాలి. ఆ తర్వాత చేతులను సబ్బుతో, శానిటైజర్‌తో శుభ్రం చేసుకోండి.

- ఇంటి పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి..అప్రమత్తంగా ఉండాలి

చేయకూడని పనులు..

- మంకీపాక్స్ బాధితుల దస్తులు, టవళ్లు ఉపయోగించ వద్దు..వారు వాడిన గదిని కూడా ఉపయోగించరాదు..

- మంకీపాక్స్ బాధితుల దుస్తులు, ఇతరుల దుస్తులను కలిపి ఉతకరాదు. వాటిని ప్రత్యేకంగా ఉంచాలి.

- మంకీపాక్స్ లక్షణాలు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి..బహిరంగ ప్రదేశాల్లో తిరగ వద్దు.

- మంకీపాక్స్‌పై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు. బాధితుల పట్ల ఎలాంటి వివక్ష ఉండకూడదు.

Also read:AP 10th Supplementary Results: పది సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..రిజల్ట్స్‌ ఇలా చెక్ చేసుకోండి..!  

Also read:China vs America: చైనా, అమెరికా మధ్య యుద్ధం తప్పదా.. తైవాన్‌పై ఎవరిది పైచేయి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News