Vijay Deverakonda Liger Attitude: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 'లైగర్'తో దుమ్ము రేపుతున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయింది. తాజాగా లైగర్ నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని 'వాట్ లగా దేంగే' సాంగ్‌ను కొద్దిసేపటి క్రితమే యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. పూరి మార్క్ మాస్ ఎలిమెంట్స్, విజయ్ యాంగ్రీ యాటిట్యూడ్‌తో 'వాట్ లగా దేంగే' సాంగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఉంది.
'వి ఆర్ ఇండియన్స్.. ఎవరి కన్నా తక్కువ కాదు.. హే చెల్లె నాతో రా.. పోదాం, కొట్లాడుదాం.. సబ్‌కీ వాట్ లగా దేంగే..' అంటూ ఈ సాంగ్‌లో విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. తెలుగుతో పాటు ఒకేసారి హిందీ, మలయాళం, కన్నడ, తమిళంలోనూ రిలీజైన ఈ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఇదీ పూరి మార్క్ అంటే.. అంటూ యూట్యూబ్‌లో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కొద్దిరోజుల క్రితమే లైగర్ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ.. డైలాగ్స్ లేకపోవడం నిరాశపరిచిందని చాలామంది కామెంట్స్ చేశారు. ఆ లోటు తీర్చేలా ఇప్పుడు విజయ్ పలికిన డైలాగ్స్‌తో 'వాట్ లగా దేంగే'సాంగ్‌ను రిలీజ్ చేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ-అనన్య పాండే హీరో హీరోయిన్లుగా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌తో పాటు వాట్ లగా దేంగే సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేయడంతో మూవీ విడుదల కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Corona Updates in India: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..డేంజర్ బెల్స్ తప్పదా..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
Liger Attitude: విజయ్ ఇచ్చి పడేశాడుగా... దుమ్ము రేపుతున్న లైగర్ 'వాట్ లగా దేంగే' సాంగ్..
లైగర్ నుంచి మరో అప్‌డేట్
తాజాగా వాట్ లగా దేంగే సాంగ్ విడుదల
యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న సాంగ్