Vijay Deverakonda Wears Rs.199 Slippers: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 'లైగర్' సౌండ్ సినీ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ట్రైలర్‌కి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ యూట్యూబ్‌లో టాప్.1గా ట్రెండింగ్‌లో ఉంది. సినిమా ప్రమోషన్‌లో విజయ్ మరోసారి తన మార్క్ చూపిస్తూ దూసుకెళ్తున్నాడు. తెలుగు ట్రైలర్ లాంచ్ సందర్భంగా విజయ్ చేసిన వ్యాఖ్యలు, ముంబైలో హిందీ ట్రైలర్ లాంచ్‌కి అతను ధరించిన సింపుల్ డ్రెస్, స్లిప్పర్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్ ఇలా సింపుల్ లుక్‌లో కనిపించడానికి అసలు కారణమేంటో అతని పర్సనల్ స్టైలిష్ట్ హర్మన్ కౌర్ తన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.
లైగర్ ప్రమోషన్స్‌లో తమ బ్రాండ్స్‌కి చెందిన ఔట్‌ఫిట్స్‌ను విజయ్ ధరించేలా చూడాలని ఎంతోమంది తమను అప్రోచ్ అయినట్లు హర్మన్ కౌర్ తెలిపింది. అందులో కొన్ని ఔట్‌ఫిట్స్‌ను ఫైనల్ చేసే పనిలో తాము నిమగ్నమవగా.. ఒకరోజు విజయ్ ఫోన్ చేసి అవేమీ వద్దని చెప్పినట్లు పేర్కొంది. లైగర్‌లో తన అండర్ డాగ్ క్యారెక్టర్‌కి తగినట్లు సాదాసీదా ఔట్‌ఫిట్స్‌తో పాటు మామూలు స్లిప్పర్స్‌తో ప్రమోషన్స్‌లో పాల్గొనాలనుకుంటున్నట్లు చెప్పాడని తెలిపింది.
మొదట విజయ్ నిర్ణయానికి తాను కాస్త సంకోచించినట్లు హర్మన్ కౌర్ పేర్కొంది. కానీ, విజయ్ ఎలాంటి ఔట్‌ఫిట్స్ ధరించినా దేశం మొత్తం తన గురించి మాట్లాడేలా చేయగలడని, ఆ నమ్మకం తనకు ఉందని.. అందుకే విజయ్ చెప్పినట్లుగానే సాదాసీదా టీషర్ట్, ప్యాంట్‌తో పాటు రూ.199 చెప్పులు కొనుగోలు చేసినట్లు తెలిపింది.ముంబై లాంటి చోట ఒక పెద్ద సినిమా ప్రమోషన్ ఈవెంట్‌కి ఇలా రూ.199 చెప్పులు వేసుకెళ్తే ఎలా రిసీవ్ చేసుకుంటారోననే సంశయం వెంటాడినప్పటికీ.. విజయ్ కారణంగా ముందుకు వెళ్లామని చెప్పింది. విజయ్ డ్రెస్సింగ్‌కి లభించిన ఆదరణతో తాము చాలా సంతోషపడ్డామని చెప్పుకొచ్చింది.
ఇక ఈ సినిమా తెలుగు ట్రైలర్ లాంచ్ సందర్భంగా విజయ్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. తాతలు, తండ్రులు అంటూ విజయ్ కామెంట్స్ చేయడం కొంతమంది స్టార్ హీరోల ఫ్యాన్స్‌కి ఆగ్రహం తెప్పించింది. దీంతో విజయ్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ కూడా విజయ్‌కి తన ట్వీట్ ద్వారా స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. తాతలు, తండ్రుల బ్యాక్ గ్రౌండ్ ఉంటే సరిపోదు మహేష్ బాబు, రాంచరణ్, ప్రభాస్‌లా టాలెంట్ కూడా ఉండాలని బండ్ల గణేశ్ విజయ్‌కి కౌంటర్ ఇచ్చాడు.
Also Read: Arjun Sarja: ఆ విషాదాలు మరువక ముందే అర్జున్ సర్జా ఇంట తీవ్ర విషాదం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
Liger: లైగర్ 'ట్రైలర్' లాంచ్‌కి రూ.199 స్లిప్పర్స్ ధరించిన విజయ్ దేవరకొండ.. అసలు కారణమేంటో చెప్పిన స్టైలిస్ట్ హర్మన్ కౌర్
రౌడీ స్టార్ లైగర్ ప్రమోషన్స్
లైగర్ ట్రైలర్ లాంచ్‌కి రూ.199 స్లిప్పర్స్ ధరించిన విజయ్
విజయ్ అలా ఎందుకు చేశాడో చెప్పిన అతని పర్సనల్ స్టైలిస్ట్