Jamun Benefits: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో ఎన్నో పోషక గుణాలున్నాయి. మరెన్నో రోగాలకు నివారణ ఉంది. ఏ పండ్లు తింటే దేనికి పరిష్కారమో తెలుసుకుంటే..మెరుగైన ఆరోగ్యం మీ సొంతమౌతుంది. అదే విధంగా నేరేడు పండ్ల ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
సృష్టిలో లభించే సకలమైన పండ్లలో నేరేడు పండు ఒకటి. పోషక పదార్ధాలు పుష్కలంగా ఉండే నేరేడు పండుని ఓ విధంగా మెడిసినల్ ఫ్రూట్ అని పిలవచ్చు. అంతటి అద్భుత ఔషధ గుణాలున్నాయి. నేరేడు పండు గురించి కొన్ని సందేహాలున్నాయి. అందులో ముఖ్యమైంది నేరేడు పండు తిన్న తరువాత నీళ్లు తాగవచ్చా లేదా అనేది. ఎందుకంటే కొన్ని రకాల పండ్లు తిన్న తరువాత నీళ్లు తాగడం మంచిది కానేకాదు. మరి నేరేడు పండు విషయంలో వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..
వేసవికాలంలో పుష్కలంగా లభించేవి నేరేడు పండ్లు. రుచిలో అమోఘం, పోషకాల్లో అద్భుతం. అయితే ఇవి తిన్నవెంటనే నీళ్లు తాగితే..ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా డయేరియా అజీర్ణం, గ్యాస్ సంబంధిత సమస్యలు ఏర్పడవచ్చని అంటున్నారు. అందుకే నేరేడు పండ్లు తీసుకున్న గంట వరకూ నీళ్లు తాగకుండా ఉండాలి.
నేరేడు పండ్లతో మీరు బరువు తగ్గించుకోవచ్చు. స్థూలకాయంతో బాధపడేవాళ్లు నేరేడు పండ్లను డైట్లో చేర్చుకుంటే మంచి ప్రయోజనాలుంటాయి. అంతేకాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ రోగులకు ఇవి చాలా మంచిది. నేరేడు పండ్లే కాకుండా..నేరేడు గింజల పౌడర్ ప్రతిరోజూ పరగడుపున గోరు వెచ్చని నీళ్లలో కలుపుకుని తాగితే.. అద్భుత ప్రయోజనాలుంటాయి. మీ డయాబెటిస్ దూరం కావచ్చు కూడా.
Also read: Teeth Cavity: పళ్ల సమస్య, దంతక్షయంతో బాధపడుతున్నారా..ఈ చిట్కా ట్రై చేయండి చాలు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook