Meena Husband Vidyasagar: పావురాల వల్ల ప్రాణాలు కోల్పోయిన మీనా భర్త... అప్పట్లోనే జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. కానీ?

Meena Husband Vidyasagar:టి మీనా కుటుంబం మొత్తం కూడా జనవరిలో కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత కరోనా నుంచి వారు కోలుకున్నారు కూడా. అయితే అప్పటికే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న విద్యాసాగర్ కు ఈ కరోనా మరింత చేటు తీసుకొచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 29, 2022, 12:04 PM IST
  • నటి మీనా భర్త మృతి
  • పావురాల వ్యర్ధాల వల్లే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్
  • కొన్నేళ్ళ క్రితమే గుర్తించిన జీహెచ్ఎంసీ
Meena Husband Vidyasagar:  పావురాల వల్ల ప్రాణాలు కోల్పోయిన మీనా భర్త... అప్పట్లోనే  జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. కానీ?

Meena husband Vidya Sagar passes away: అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా దక్షిణాది మొత్తాన్ని ఏలిన మీనా భర్త చనిపోవడం ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.. గత కొంత కాలంగా పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న విద్యాసాగర్ చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో కన్నుమూశారు. సినిమా అవకాశాలు తగ్గుతున్నాయి అనుకున్న సమయంలో అంటే 2009లో మీనా అప్పట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న విద్యాసాగర్ ను వివాహమాడారు. వీరి పెళ్లి తర్వాత విద్యాసాగర్ ఉద్యోగం మానేసి వ్యాపారాలు మొదలుపెట్టారు. ప్రస్తుతానికి ఆయన వ్యాపారాలు అద్భుతంగా సాగుతున్నాయి. వీరి ప్రేమకు గుర్తుగా నైనిక అనే చిన్నారి జన్మించింది. ఆమెను కూడా సినీ నటిని చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటిగా ఎంట్రీ ఇప్పించారు. 

ఇక నటి మీనా కుటుంబం మొత్తం కూడా జనవరిలో కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత కరోనా నుంచి వారు కోలుకున్నారు కూడా. అయితే అప్పటికే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న విద్యాసాగర్ కు ఈ కరోనా మరింత చేటు తీసుకొచ్చింది. దానికి తోడు ఆయన పావురాల వ్యర్థాల నుంచి వచ్చిన గాలి పీల్చడం వల్ల మరింత ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు అని డాక్టర్లు గుర్తించారు. ఆయన కొన్నాళ్లుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కోసం చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్న కారణంగా వాటిని ట్రాన్స్ ప్లాంట్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. 
కానీ చాలా కాలంగా బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ కోసం ఎదురుచూస్తున్నా ఎలాంటి ఫలితం లేదు. 

గత కొన్నాళ్లుగా మందులతోనే విద్యాసాగర్ ను బతికిస్తూ వస్తున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం నాడు ఆయన కన్నుమూశారు. అయితే పావురాలు వ్యర్థాల వల్ల మానవుని ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందన్న విషయం 2019వ సంవత్సరం లోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్తించింది. అప్పట్లో హైదరాబాద్ పరిధిలో పావురాలను ఎవరూ పెంచుకోరాదని బహిరంగ ప్రదేశాల్లో వాటికి ఆహారం వేసి వాటి సంతతి పెరుగుదలకు కారణం కావద్దని ఆదేశాలు కూడా జారీ చేశారు. అప్పట్లో పావురాలను పట్టుకుని శ్రీశైలం అడవుల్లో కూడా కొన్ని దఫాలు వదిలి వచ్చారు. 

కానీ ఆ తర్వాత ఈ అంశం మీద దృష్టి పెట్టడం అయితే మీడియా కంట పడలేదు. ఇప్పుడు మీనా భర్త మృతి విషయంలో కూడా పావురాల వ్యర్థాల కూడా ఒక కారణమని డాక్టర్లు చెప్పడంతో ఈ చర్చ మరోసారి తెరమీదకు వచ్చింది. గతంలో బహిరంగ ప్రదేశాల్లో కూడా మేత వేయొద్దు అని ఆదేశాలు జారీ చేసిన సమయంలో కొన్నాళ్ళు మేత వేయకుండా చర్యలు తీసుకున్నారు కానీ ఇప్పుడు అయితే మళ్లీ యధావిధిగా పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ లో ఎక్కువగా బహుళ అంతస్తుల భవనాలలో వాటి వెంటిలేటర్ల వద్ద, కిటికీల వద్ద గూళ్ళు ఏర్పాటు చేసుకుని పావురాలు ఎక్కడపడితే అక్కడ దర్శనం ఇస్తూ ఉంటాయి. ప్రభుత్వాలే ఈ విషయం మీద చర్యలు తీసుకోవాలని కాకుండా వ్యక్తిగతంగా మనం ఏం చేయగలమో అని ఆలోచించినప్పుడే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఉండే అవకాశం ఉంటుంది.
Also Read: Meena Husband Death: విషాదం.. నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం..

Also Read: Chiru with PM Modi: ప్రధాని మోడీతో వేదిక పంచుకోబోతున్న మెగాస్టార్ చిరంజీవి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News