India Post Recruitment 2022: ఇండియా పోస్ట్ 'స్టాఫ్ కార్ డ్రైవర్' పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు indiapost.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 20, 2022. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 24 పోస్టులు భర్తీ చేయనున్నారు.అర్హత, ఎంపిక ప్రక్రియ మరియు ఇతర వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
విద్యార్హత, ఇతర అర్హతలు :
గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. మోటార్ మెకానిజంపై కూడా పరిజ్ఞానం కలిగి ఉండాలి.
అభ్యర్థులు కనీసం మూడు సంవత్సరాల పాటు లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ నడిపిన అనుభవం కలిగి ఉండాలి.
పదవీ విరమణ చేసిన లేదా ఒక సంవత్సరంలోపు రిజర్వ్‌కు బదిలీ చేయబడి, తగిన అర్హతలు ఉన్న మాజీ సైనికులు కూడా అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగానికి అర్హులుగా పరిగణించబడతారు.
ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ 2022 దరఖాస్తు ప్రక్రియ
ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ indiapost.gov.in ఓపెన్ చేయండి
స్టాఫ్ డ్రైవర్ రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ లింకుపై క్లిక్ చేయండి
మీ పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోండి
స్టాఫ్ డ్రైవర్ పోస్ట్ అప్లికేషన్ ఫారమ్‌ను నింపి సబ్‌మిట్ ఆప్షన్ నొక్కండి
ఆ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి.. సంబంధిత డాక్యుమెంట్స్ జత చేసి ఇండియా పోస్ట్ సూచించిన చిరునామాకు పంపించాలి.
అప్లికేషన్, డాక్యుమెంట్స్ పంపించాల్సిన చిరునామా :
అభ్యర్థులు సీనియర్ మేనేజర్ (JAG), మెయిల్ మోటార్ సర్వీస్, నం. 37, గ్రీమ్స్ రోడ్, చెన్నై- 600006.
పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్
https://www.indiapost.gov.in/VAS/Pages/Recruitment/IP_13062022_MMS_Eng_0... లింకుపై క్లిక్ చేయండి.
Also Read: Kollapur Fight: తగ్గేదే లే అంటున్న జూపల్లి.. తొడగొడుతున్న హర్షవర్ధన్! పోలీస్ పహారాలో కొల్లాపూర్..
Also Read: Rohit Sharma Covid 19: టీమిండియాకు బిగ్ షాక్.. కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.